తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు వయసుపైబడిన చాలామంది పురుషులు ఇంకా పిల్లలు పుట్టే వయసులోనే వున్న యువతులకు అన్వేషిస్తున్నారట. ఇపుడు పురుషులు 45 – 49 వయసు వారు 30 నుండి 34 సంవత్సరాల వయసున్న మహిళలను కోరుతున్నారని, వీరి సంఖ్య 2010 నాటి చివరకు సుమారు 6 శాతం పెరిగిందని జాతీయ గణాంక సంస్ధ రికార్డులు చెపుతున్నాయి. వెనుకబడి, అంతమైపోతోందనుకున్న వివాహ వ్యవస్ధకు ఈ రకంగా మరోమారు పునరుజ్జీవనం పొందటం జరుగుతోంది.
2010 నాటికి ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో ఈ రకంగా పెళ్ళిళ్ళు చేసుకున్నవారి సంఖ్య 3.7 శాతం పెరిగి 241,000 వరకు చేరిందని ది డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. ఈ దేశంలో వివాహాలను ఏర్పాటు చేసే ఒక సంస్ధ పెళ్ళిళ్ళు చేసుకునే వారి సంఖ్య పెరిగిందని అయితే జంటలలో ఒకరు మాత్రం గతంలోనే ఒక సారి పెళ్ళి చేసుకుని రెండోసారికి సిద్ధం అవుతున్నారని తెలిపింది.
పురుషులు తమ 40 సంవత్సరాల పైబడిన వయసులో పెళ్ళి చేసుకుంటుండటంతో ఈ పెరుగుదల కనపడుతోందట. వీరు విడాకుల ప్రక్రియ అంతా ఆచరించినప్పటికి వివాహం చేసుకోరాదని మాత్రం నిర్ణయించుకోడం లేదట.