హెల్త్ టిప్స్

మీ కాళ్లు స‌న్న‌గా, ఆక‌ర్ష‌ణీయంగా మారాలంటే.. ఇలా చేయండి..!

కత్రినా కైఫ్, దీపికా పడుకునే వంటి బాలీవుడ్ భామల సన్నని ఆకర్షణీయమైన కాళ్ళను చూసి అసూయ చెందుతున్నారా? కొద్దిపాటి సామాన్య వ్యాయామాలతో మీరు కూడా అట్టి వాటిని పొందే అవకాశం వుంది. ఎలాగో చూద్దాం- కాళ్ళ వ్యాయామాలకు జిమ్ కు వెళ్ళనవసరం లేదు. ఇవి కొంచెం కష్టమైనప్పటికి, దెబ్బలు తగిలేవైనప్పటికి వ్యక్తులు సాధారణంగా తమ దిగువ శరీరభాగం పటిష్టంగా వుండాలని, ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటారు.

మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరవిషయమేమంటే సాధారణంగా జిమ్ లో వుండే పరికరాలు మీ దిగువ శరీర భాగానికి లేదా కాళ్ళకు లేదా తొడ భాగాలకు పెద్దగా ఉపయోగపడవనేది. 1. మెట్లను ఎక్కండి – మీరు ఉద్యోగస్తులయి వుండి జిమ్ కి వెళ్ళే సమయం లేకుంటే, పెద్ద పెద్ద అంగలతో ఆఫీసు మెట్లు ఎక్కేయండి. ఎంత పెద్ద అంగ వేస్తే మీ కండరాలు అంత బాగా సాగుతాయి. 2. చేతులు పిరుదులపై పెట్టండి. ఒక కాలును మోకాలు నేలకు తగిలించి రెండవ కాలును నేలకు తగిలించకుండా వెనక్కు సాగతీయండి.

if you want beautiful legs follow these

3. ఒక గట్టి అట్టను పట్టుకొని ఒక కాలును ముందుకు మరో కాలును వెనక్కు సాగతీయడం కాళ్ళకు బలాన్నిస్తుంది. 4. సైకిలింగ్ – కాళ్ళు బలపడాలంటే సైకిలింగ్ మంచి వ్యాయామం. దీనివలన తొడభాగాలు, మోకాలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి. 5. నడక – అన్నిటికంటే అతి సామాన్యమైన వ్యాయామం. బరువు తగ్గటానికి అధిక సమయం తీసుకున్న‌ప్పటికీ ఖర్చు లేనిది కనుక అందరూ దీనినే ఎంచుకుంటారు.

Admin

Recent Posts