ఒక సంబంధాన్ని వాస్తవమైనదిగా ఎపుడు భావించాలి. చాలామంది తాత్కాలికంగానే తప్ప నిజంగా ఎప్పటికి కొనసాగించేలా వుండరు. ఈ విషయం అవతలి భాగస్వామికి కూడా తెలిసిందే. కాని నేటి ప్రపంచానికి అనువైన తీరులో అంటిపెట్టుకొని వుండాల్సి వస్తోంది. కొంతమంది ఇంటర్నెట్ లోను మరి కొందరు దూర దేశాలలోను కూడా తమ సంబంధాలు కొనసాగిస్తూనే వుంటారు. కాని అసలు వారి మధ్య గల అనుబంధం నిజమైనదేనా అనేది పరీక్షపైగాని పైకి తేలదు. సంబంధం వాస్తవం అనుకోటానికి కొన్ని సూచనలు చూడండి. నేటి యువతరానికి కట్టుబడి వుండటం అంటే చాలా వరకు అది ఫేస్ బుక్ వరకే. కాని కట్టుబాటు అనేది సమాజం కొరకు కాదు. అది మనకొరకే అని గుర్తించాలి.
సమాజపరంగా మన సంబంధాలు సాధారణంగా వుండాలి. సమాజం కొరకు మన సంబంధాలు ప్రదర్శించరాదు. కొంతమంది ఎంత దూరం లో వున్నప్పటికి చాలా ప్రేమగా వుంటారు. కాని మీరు ఒకరిపట్ల మరిఒకరికి గల సంబంధం లేదా వాస్తవ సమస్యలు తెలియాలంటే ఒకే ఇంటిలో వుండటం అవసరం. మీరు చేసుకునేది వివాహం లేదా కలసి వుండే ఏర్పాటు ఏదైనా కావచ్చు. కలసి వుంటే మీ మధ్య దూరం ఎంత దగ్గర ఎంత అనేది తెలుస్తుంది. హృదయాలకు సంబంధించిన ప్రేమా? అదంతా కవిత్వానికి పరిమితం. మీరు స్పర్శించి దానిని భావిస్తే అదే మీకు వాస్తవం. మీ భాగస్వామికి శారీరకంగా దగ్గరగా వున్నపుడే మీ వాస్తవ ప్రేమ ఏమిటో తెలుస్తుంది.
మీ సంబంధం ఏదైనా సంక్షోభంలో పడ్డప్పటికి మరోమారు కొనసాగగలదా? సంక్షోభం అంటే అది మీరు ఊహించని ప్రెగ్నెన్సీ కావచ్చు లేదా బిడ్డ చనిపోవటం లేదా తల్లి తండ్రులు ఆమోదించకపోవటం వంటివి కావచ్చు. కనుక మీది నిజమైన సంబంధమే అనుకుంటే ఇటువంటివి కూడా ఎదుర్కొని నిలబడాలి. ఒక సంబంధం అనేది మీ మధ్య పోట్లాటలు, తగవులు వుంటేనే వాస్తవం అనిపిస్తుంది. మా మధ్య తగాదాలు లేవు అనే జంటలు అబద్ధమన్నా ఆడుతూండాలి లేదా వారి మధ్య నిజమైన ప్రేమ అయినా లేకపోవచ్చు. మీరిద్దరూ మేము విడిపోతున్నామని మాటమాత్రంగా పైకి చెప్పుకుంటున్నారా? అయితే, మీ మధ్య నిజంగా ప్రేమ వున్నట్లే. ఏదీ నిజంకాని ప్రస్తుత వాస్తవిక ప్రపంచంలో మీకు ఒక వాస్తవ సంబంధం అంటూ వుంది. కనుక మీకై మీరు మీ భాగస్వామి మరి దానిని పరీక్షించుకోండి.