వ్యాయామం

వాకింగ్ ట్రెడ్ మిల్ మీద‌నా, బ‌య‌ట‌నా..? ఎలా చేస్తే మంచిది..?

నడక ఆరోగ్యానికి చాలా మంచిదనే డాక్టర్లు చెపుతుంటారు. అయితే, వాకింగ్‌కు వెళ్ళాలంటే మాత్రం బద్ధకిస్తూ వుంటాం. ముఖ్యంగా ఇంటి ఆవరణదాటి వాకింగ్ చేయాలంటే మహా కష్టం. అందుకే వేలాది రూపాయలు పెట్టి ట్రెడ్‌మిల్‌ (వాకింగ్ మిషన్)ను కొనుగోలు చేస్తాం. దీన్ని కొనుగోలు చేస్తే మనకు అనువైన సమయంలో ఇంటిలోనే వాకింగ్ చేసుకోవచ్చని అనుకుంటూ వుంటాం.అయితే, వాకింగ్ ఎక్కడ చేస్తే బాగుటుంది. ట్రెడ్‌మిల్ పై చేయటం బెటరా? అవుట్‌డోర్‌లో వాకింగ్ చేయడం బెటరా? అనే సందేహం వస్తుంది. ఈ సందేహంపై వ్యాయామ నిపుణుల వద్ద ప్రస్తావిస్తే..

ట్రెడ్‌మిల్ కంటే పార్కుల్లో వాకింగ్ చేయడం వల్లనే మంచి ఫలితాలుంటాయని వ్యాయామ నిపుణులు చెపుతున్నారు. వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఫ్రీగా కదలాలి. ట్రెడ్‌మిల్‌తో పోల్చితే రోడ్డుపైనా వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఫ్రీగా కదులుతాయి. ట్రెడ్‌మిల్ కదులుతూ ఉంటుంది. దానిపైనా వాకింగ్ చేసేటప్పుడే పెద్దగా ప్రెషర్ పెట్టకుండానే మీరు కదులుతుంటారని, ఇలాంటి నడక వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తే తక్కువ క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని చెపుతున్నారు.

treadmill vs road walking which one is better

అదే రోడ్డుపై వాకింగ్ చేసేటప్పుడు మూవ్‌మెంట్ కోసం కండరాలను ఎక్కువగా కదపాల్సి ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. అందుకే వ్యాయామ నిపుణులు రోడ్లపై వాకింగ్ చేయాలని సూచన చేస్తున్నారు. ముఖ్యంగా, జిమ్‌లు, అవుట్‌డోర్‌ యూనిట్లు, గృహాల్లో ఏసీ ఉంటుంది. ఇలాంటి చల్లని వాతావరణంలో ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తే తక్కువ క్యాలరీలు శక్తి ఖర్చు అవుతుందని, ముఖ్యంగా శరీరం నుంచి చమట గ్రంథులు విడుదల కావని చెపుతున్నారు. అందుకే ట్రెడ్‌మిల్ కంటే పార్కుల్లో వాకింగ్ చేయటం ఉత్తమమని వ్యాయామ నిపుణులు తెలుపుతున్నారు.

Admin

Recent Posts