lifestyle

చాణక్య నీతి : భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే అసలు చేయకూడని పనులు ఇవే…!

1. రహస్యాలను పంచుకోవడం..

భార్య భర్తల బంధంలో.. ఎవరి రహస్యాలను వారి దగ్గరే ఉంచుకోవడం చాలా ఉత్తమమైన విషయం. అలా కాదని.. తమ కు సంబంధించిన చెప్పరాని రహస్యాలను పార్ట్‌ నర్‌ కు చెబితే.. విడాకులకు దారి తీయవచ్చు. కాబట్టి.. గతంలో జరిగిన విషయాలను మరిచిపోయి.. ప్రస్తుత జీవితాన్ని గడపాలి.

2. ఒకరినొకరు కించ పరుచుకోవడం

భార్య భర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. ఒకరి ఒకరు అస్సలు తక్కువ చేస్తూ.. మాట్లాడకూడదు. లైఫ్‌ పార్ట్‌ నర్‌ కు ఇబ్బంది కలిగేలా వ్యవహరించకూడదు. పార్టనర్‌ గురించి తక్కువగా చేస్తూ.. ఎవరితో,,, ఎక్కడా కూడా మాట్లాడొద్దు. అప్పుడే సంసారం బలంగా ఉంటుంది.

3. అసత్యాలు చెప్పుకోవడం

భార్య, భర్తలు ఎప్పుడూ కూడా అబద్దాలు మాట్లాడుకోవకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇద్దరు ఎప్పుడూ అబద్దాలు ఆడితే.. వారి వైవాహిక జీవితం లో అనేక సమస్యలు తలెత్తవచ్చును. అంతేకాదు.. డాకులకు దారి తీయవచ్చు.

husband and wife must follow these to make their relationship strong

4. సఖ్యత లేకపోవడం..

అగ్నిలో నెయ్యి పోస్తే.. ఎలా రగిలిపోతున్నదో.. అలాగే.. కోపంలో ఉన్న వ్యక్తిని మరింత రెచ్చగొడితే.. కోపం మరింత పెరుగును. కాబట్టి సరైన సమతుల్యత లేకపోవడం వల్ల కోపంలో ఎలాంటి హాని అయినా జరుగవచ్చును.

5. మూడో వ్యక్తిని ఆహ్వానించడం…

దాంపత్య జీవితం అనేది నిజాయితీకి ప్రతి రూపం. ఎప్పుడైతే దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తారో.. వారి దాంపత్య బంధం చెడుగా ముగిసే అవకాశం ఎక్కువ.

Admin

Recent Posts