భార్యా భర్తల ముందు ఎటువంటి దాపరికాలు కూడా పనికిరావు. భార్య ప్రతి విషయాన్ని భర్తకి, అలానే భర్త ప్రతి విషయాన్ని భార్యకి చెప్పాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ వెళ్తే జీవితం ఎంతో బాగుంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు అనేక తప్పులు చేసి, బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. ఆచార్య చాణక్య జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందించారు. చాణక్య నీతి ద్వారా ఎన్నో విషయాలని చెప్పడం జరిగింది.
వాటిని ఆచరిస్తే, ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. భార్యాభర్తల గురించి కూడా అనేక విషయాలని ప్రస్తావించారు చాణక్య. చాణక్య ప్రకారం భర్త తన గురించి భార్య కి ఈ నాలుగు విషయాలని చెప్పకూడదు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. భర్త ఎప్పుడూ కూడా తన సంపాదన గురించి భార్యకి చెప్పకూడదు అని చాణక్య అన్నారు. భర్త ఎంత సంపాదిస్తున్నారో భార్యకి తెలిస్తే, ఆమె ఖర్చులు ఎక్కువ చేస్తుందట. కాబట్టి, భర్త సంపాదన భార్యకి తెలియకూడదని చాణక్య చెప్పారు.
అలానే, ప్రతి మనిషికి కూడా ఒక బలహీనత అనేది ఉంటుంది. బలహీనత గురించి భార్యకి భర్త చెప్పకూడదు. ఒకవేళ చెప్తే, పదే పదే దాని గురించి ఆమె మాట్లాడుతుంది. దానిని అధిగమించాలని, అతను అనుకున్నా ఆమె మాత్రం ఆ వైపు వెళ్లకుండా చేస్తుంది. భర్త జీవితంలో ఏదైనా అవమానాన్ని ఎదుర్కొంటే, దాని గురించి భార్యతో చెప్పకూడదు.
ఎందుకంటే, పదేపదే దాని గురించి ఆటపట్టించడం, గుర్తు చేయడం వంటివి జరుగుతాయి. కాబట్టి, ఈ విషయాన్ని కూడా భర్త భార్యతో చెప్పకూడదు. భర్త ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని గురించి భార్యతో చెప్పకూడదు. చెప్తే ఆమె అడ్డుపడొచ్చు. కాబట్టి, ఈ విషయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యతో భర్త చెప్పకూడదని ఆచార్య చాణక్య అన్నారు.