lifestyle

Intelligent : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయా.. అయితే మీరు తెలివైన వారు అన్న‌ట్లే..!

Intelligent : మీరు తెలివైన వారే అని అనుకుంటున్నారా ? ఏంటీ వింత ప్ర‌శ్న అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే.. తెలివి ఉన్న వారు ఎవ‌రూ త‌మ‌కు బాగా తెలివి ఉంద‌ని గొప్ప‌లు చెప్పుకోరు. తెలివి లేని వారే ఆ ప‌నిచేస్తుంటారు. అయితే తెలివి తేట‌ల విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రికైనా కింద తెలిపిన అంశాలు స‌రిపోతే.. వారు తెలివిగ‌ల వారికిందే లెక్క‌న‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టుల అధ్య‌య‌నాలే చెబుతున్నాయి. మ‌రి ఏయే అంశాలు ఉంటే తెలివిక‌ల‌వారో ఇప్పుడు తెలుసుకుందామా..!

మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని బాగా వాయిస్తారా ? 4 నుంచి 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే వాయిద్యాల‌ను వాయించ‌డం బాగా నేర్చుకున్నారా ? అయితే మీరు బాగా తెలివిక‌ల‌వారి కింద లెక్కేన‌ని సైంటిస్టులు చెబుతున్నారు. సాధార‌ణంగా కుటుంబంలో వ‌య‌స్సులో అంద‌రిక‌న్నా పెద్ద‌వారు బాగా తెలివిగ‌ల వారు అయి ఉంటార‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. మీరు బాగా స‌న్న‌గా ఉన్నా తెలివిక‌ల‌వారి కింద‌కే వ‌స్తారు. ఎందుకంటే 2006లో సైంటిస్టులు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం తెలిసింది.డ‌బ్బా పాల క‌న్నా త‌ల్లిపాలు తాగి పెరిగిన వారికే తెలివితేట‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.

if you have these qualities then you are intelligent

పుస్త‌క ప‌ఠ‌నం అంటే ఆస‌క్తి ఉన్న‌వారు కూడా తెలివిమంతులు అయి ఉంటార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఎడ‌మ చేతి వాటం ఉన్న‌వారు కూడా బాగా తెలివిక‌ల వారు అయి ఉంటార‌ట‌. బాగా ఆందోళన ప‌డేవారు, హాస్య చ‌తురుల క‌లిగి ఉండేవారు, ఏదైనా నిర్దిష్ట‌మైన విష‌యం ప‌ట్ల ఆస‌క్తి క‌లిగి ఉండేవారు, అన్ని విష‌యాల్లోనూ ప‌ర్ఫెక్ష‌న్ కోరుకునేవారు తెలివిమంతుల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక చివ‌రిగా.. ఎవ‌రికీ అర్థం కాకుండా రాసేవారు కూడా తెలివిక‌ల వారు అయి ఉంటార‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది.

Admin

Recent Posts