lifestyle

మీ “చేతి వేళ్లు” ఇలా ఉన్నాయా..? అయితే మీకు ఎప్పటికి మనశ్శాంతి ఉండదు అంట.!

ఎదుటి వ్య‌క్తులు ప్ర‌వ‌ర్తించే తీరు, వారి అల‌వాట్లు, ముఖ క‌వ‌ళిక‌లు త‌దిత‌ర అనేక అంశాల‌ను ప‌రిశీలిస్తే వారి మ‌న‌స్త‌త్వాన్ని ఎవ‌రైనా ఇట్టే తెలుసుకోవ‌చ్చు. అది పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ ఎదుటి వ్య‌క్తుల చేతి వేళ్ల పొడ‌వును బ‌ట్టి కూడా వారి మ‌న‌స్త‌త్వం ఏమిటో చెప్ప‌వచ్చంటే మీరు న‌మ్మ‌గ‌లరా ? న‌మ్మ‌లేరు క‌దా. కానీ అది నిజ‌మే. ఫ్రీనాల‌జీ అనే విద్య ద్వారా కేవ‌లం ఎదుటి వ్య‌క్తుల చేతి వేళ్ల పొడ‌వును చూసి వారు ఎటువంటి వారో సింపుల్‌గా చెప్పేయ‌వ‌చ్చు. వారి మ‌న‌స్తత్వం కూడా తెలిసిపోతుంది. అయితే మ‌రి అందుకు ఇప్పుడు ఆ విద్య‌ను నేర్చుకోవాలా ? అంటే.. అబ్బే.. అక్క‌ర్లేదు. అందులో ఉండే మూడు ముఖ్య‌మైన పాయింట్లు తెలిస్తే చాలు, ఎదుటి వారి చేతి వేళ్ల పొడ‌వును బ‌ట్టి వారి వ్య‌క్తిత్వం, మ‌న‌స్త‌త్వాల‌ను ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు. మ‌రి ఆ మూడు పాయింట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా…

1. మీ రెండు చేతులను ఒక‌సారి ప‌రిశీలించి చూసుకోండి. మీ చేతి వేళ్ల‌ను చూడండి. ఉంగ‌రం వేలు, చూపుడు వేళ్ల‌ను ఒక‌సారి చూసుకోండి. మీ చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా పెద్దదిగా ఉంటే మీరు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులలో అయినా అంతర్ముఖులుగా వ్యవహరిస్తుంటారు. అంటే మీలో మీరే మాట్లాడుకోవడం, మీ అంతరాత్మతో మీరు చర్చలు చేయడం వంటివి చేస్తుంటారు. మీరు దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు. అనేకమైన సమస్యలను ప‌రిష్క‌రించుకుంటారు. వీరు సైంటిస్ట్, ఇంజినీర్, సోల్జర్, క్రాస్ వర్డ్ , చెస్ మాస్టర్ లుగా రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

if your fingers are like this then you will never get peace

2. ఒకవేళ ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా చిన్నదిగా ఉంటే మీరు ఆత్మస్థైర్యం కలిగి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా పని చేసేట‌ప్పుడు ఒంటరిగా ఆ పని పూర్తిచేసేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అలాగ‌ని మీరు అంద‌రికీ దూరంగా ఉండ‌రు. కాక‌పోతే ప‌ని మీద అంత ప‌ట్టుద‌ల‌గా ఉంటారు. లక్ష్యసాధన దిశగా మీ ప్ర‌యాణం కొనసాగుతూ ఉంటుంది. ఇతరులు మీ దిశలో అడ్డు వ‌స్తే సహించలేరు. ఉన్నదాంతో సంతృప్తి చెందడం, పట్టుదలతో ప్రయత్నించి సాధించుకోవడం మీ లక్షణాలుగా ఉంటాయి.

3. ఉంగరపు వేలు, చూపుడు వేలు సమాంతరంగా ఉంటే మీరు అధికంగా మనశ్శాంతి కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఎక్కువగా వ్యవస్థీకృత ఆలోచనలు చేస్తుంటారు. ఎక్కువగా తమ భాగస్వాముల పట్ల శ్రద్ధ‌తో, ప్రేమగా ఉంటారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకుంటే , మీలో రెండవ కోణం కూడా కనిపిస్తుంది. ఆ కోణం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. క‌నుక‌ ఎవ‌రూ కూడా మీకు వ్యతిరేకంగా ఆలోచనలు చేయ‌కుండా ఉండేలా వారిని మీ వైపే ఉండేట్లు చూసుకోవాలి.

Admin

Recent Posts