lifestyle

Divorce : భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంటే క‌ష్ట‌మేనా ? విడాకులు తీసుకుంటారా ?

Divorce : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది సెల‌బ్రిటీ జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయి. మ‌న దేశంలోనూ ఏటా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. భార్యా భ‌ర్త విడాకులు తీసుకునేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఇద్ద‌రి మ‌ధ్యా ఏజ్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంటే.. అది విడాకుల‌కు దారి తీస్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన వేర్వేరు అధ్య‌య‌నాలు ఈ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి.

న్యూయార్క్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ పాలా ఇంగ్లండ్ బృందం 3622 జంట‌ల‌పై అధ్య‌య‌నం చేసింది. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. విడాకులు కోరుతున్న వారిలో పురుషుల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని, వారి శాతం 87 గా ఉంద‌ని తెలిపారు. కొన్ని జంటల్లో భార్య‌ల వ‌య‌స్సు భ‌ర్త‌ల క‌న్నా 3 ఏళ్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. అలాంటి వారిలో భ‌ర్త‌లు ముందుగా విడాకులు కోరుతున్నార‌ని తెలిపారు. భార్య త‌న క‌న్నా ఎక్కువ స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని, ప‌రిపక్వ‌త‌తో ఆలోచిస్తుంద‌ని భావించే వ‌య‌స్సు త‌క్కువ ఉన్న భ‌ర్త‌లు ముందుగా విడాకులు తీసుకుంటున్నార‌ని తెలిపారు.

ఇక భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ 5 అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉన్నా మంచిది కాద‌ని.. ఇలాంటి జంట‌లు కూడా విడాకులు తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని అంటున్నారు. ఈ మేర‌కు హౌజ్ హోల్డ్‌, ఇన్‌క‌మ్ అండ్ లేబ‌ర్ డైనిమ‌క్స్ ఇన్ ఆస్ట్రేలియా అనే అధ్య‌య‌నంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇలాంటి జంట‌ల్లో భ‌ర్త వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అత‌ను చెప్పే విష‌యాల‌ను వ‌య‌స్సు త‌క్కువ‌గా ఉండే భార్య అర్థం చేసుకోలేక‌పోతుంద‌ని.. అందుక‌నే భ‌ర్త‌లు విడాకులు కోరుతున్నార‌ని వెల్ల‌డైంది.

Divorce : 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే వారు కూడా..

అయితే భార్య భ‌ర్త‌ల వ‌య‌స్సు స‌మానంగా ఉంటే వారు ఒక‌రినొక‌రు బాగా అర్థం చేసుకుంటార‌ని.. వారు విడిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. అలా కాకుండా భార్యా భ‌ర్త‌ల్లో ఏ ఒక్క‌రి వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉన్నా.. వారు విడిపోయే అవ‌కాశాలు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. ఇక 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే వారు కూడా త్వ‌ర‌గా విడాకులు తీసుకుంటార‌ని వెల్ల‌డించారు. 32 దాటాక కూడా వివాహం చేసుకుంటే విడాకులు తీసుకునే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని, క‌నుక 24 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య వివాహం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దాంప‌త్యం అన్యోన్యంగా ఉంటుంద‌ని అంటున్నారు.

Share
Admin

Recent Posts