వైద్య విజ్ఞానం

Bones : ఈ ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డుతున్నాయా.. అయితే మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారాయ‌ని అర్థం..!

Bones : ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అయితే ఒక్కొక్కసారి కొన్ని సంకేతాల ద్వారా ఎముకలు బలహీనంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం శరీరంలో తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి.

వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు అరిగిపోవడం సహజమే. బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, కీళ్ల నొప్పులు ఇలా అనేక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎముకలు బలాన్ని కోల్పోతాయి. నెమ్మదిగా కుళ్ళిపోతాయి. అందుకని ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా అవసరం. చాలామంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. వెన్నునొప్ ని అసలు లైట్ తీసుకోకండి.

if you have these symptoms then your bones might be weak

అనారోగ్యకరమైన ఎముకలకు ఇది సంకేతం అని తెలుసుకోండి. గోళ్ళని బట్టి కూడా మనం క్యాల్షియం లోపం ఉందని గ్రహించొచ్చు. గోళ్ళపై చర్మం దెబ్బ తినడం, గోళ్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనపడితే పోషకాహార లోపం అని గ్రహించాలి. పోషకాహార లోపం వలన ఎముకలు బలహీనంగా మారాయని గ్రహించాలి. తగిన పోషకాలని తీసుకోవడం అవసరం. ఏదైనా మీరు పట్టుకోలేకపోతున్నట్లయితే కూడా ఎముకలు బలహీనంగా ఉన్నాయని గ్రహించాలి.

నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి సంకేతాలను బట్టి కూడా మనం ఎముకల సమస్య అని తెలుసుకోవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు లేదంటే నడుస్తున్నప్పుడు సులభంగా పగుళ్లు వంటివి ఎముకల సమస్య ప్రమాదాన్ని ఇంకొంచెం పెంచుతాయి. నోటి ఆరోగ్యం బట్టి కూడా మనం ఎముకల‌ సమస్యల్ని గుర్తించొచ్చు. దంతాల సమస్యల‌ వంటివి కలిగితే కూడా ఎముకలు బలంగా లేవని గ్రహించాలి. దంతాలు ఊడిపోవడం వంటివి కూడా కొంతమందిలో కనబ‌డతాయి. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కచ్చితంగా అది ఎముకల సమస్య అని గుర్తుపెట్టుకోండి. ఎముకలు బలహీనంగా ఉన్నాయని గ్రహించండి. వైద్యుడి సలహా తీసుకోండి.

Share
Admin

Recent Posts