lifestyle

పిల్లల పెంపకం లో పెద్దలు చేస్తున్న 4 తప్పులు అవేనా? తప్పక తెలుసుకోవలసిన నిజాలు!

ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచుతూ ఉంటారు. వారు ఏదడిగినా కాదనకుండా తెచ్చి ఇస్తూ ఉంటారు.. వాళ్లకు కష్టం సుఖం పదాలు తెలియకుండా పెంచుతుంటారు.. మరలా పెంచడం మంచిదేనా.. దీని వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా చూసుకోవాలి అనుకోవడం మంచిదే కానీ అది మరీ ఎక్కువైతే ప్రమాదం. పిల్లలపై మనం చూపించే అతి ప్రేమ బద్దకస్తులను చేస్తుంది అనేది నిజం..

10 ఏళ్ల పిల్ల‌లు ఇంట్లో ఏదైనా పనులు చేయమంటే చేయరు..కిరాణా షాప్ కి వెళ్లి ఏదైనా సరుకులు తీసుకు రమ్మంటే కూడా వెళ్లరు.. కనీసం వారి స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు కూడా శుభ్రం చేసుకోలేరు.. రాత్రి పది గంటల వరకు పడుకొని ఉదయాన్నే ఆరు గంటలకు నిద్ర లేవ మంటే లేవరు.. గట్టిగా మందలిస్తే ఎదురు సమాధానం చెబుతారు.. ఒకవేళ తిట్టావ్ అంటే వస్తువులను విసిరి కొడతారు.. ప్రస్తుత కాలంలో పిల్లలకు ఇలాంటి అలవాట్లు చాలా వరకు ఉంటాయట. ఇంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఏ పని లేకుండా ఊరికే ఇంట్లో ఉంటూ పనిమనిషి పై ఆధారపడి పనులు చేయిస్తారు..

parents are doing these mistakes while raising their kids

ఒకవేళ వారి అత్తమామలు ఇంటికి వస్తే ఏదో ఒక విధంగా వారిని బయటకు తరిమి వేసే విధానంగా ఆలోచిస్తారు. కానీ వీరికి వచ్చే కోడలు మాత్రం వీరి కాళ్ళకింద ఉండాలని కోరుకుంటారు.. ఈ విధంగా తల్లిదండ్రులే బాధ్యత లేకుండా ప్రవర్తించి వారి పిల్లలను సోమరిపోతులను చేస్తున్నారు.. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలాంటి బాధ్యతలు నేర్పకుండా కనీసం తిన్న కంచాన్ని కూడా తీసే పరిస్థితి లేదు.. ఇలా ఉండటం వల్ల మీరు ఇల్లు ఊడవమన్నా కోపాలు, బంధువులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వాలని ఆలోచన రాదు. 20 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు వంట చేయడం అనేది రావడం లేదు. కల్చర్ ట్రెండ్ పేరుతో వింత పోకడలు దీనికి ప్రధాన కారణం వారిని గారాబంతో పెంచడం..

పిల్లలకు నేర్పాల్సినవి.. మర్యాద, గౌరవం, బాధ్యతకష్టం, ఓర్పు, దాతృత్వం, సహనం, అనురాగం, సహకారం, నాయకత్వం, కుటుంబ సంబంధాలు, మానసిక దృఢత్వం, దేశభక్తి, దైవభక్తి..ఈ విధంగా పిల్లలను తల్లిదండ్రులు పెంచితే భావితరాలకు మంచి సంప్రదాయం అందించిన కుటుంబీకులం అవుతాం.

Admin

Recent Posts