హెల్త్ టిప్స్

రోజుకో యాపిల్ తీసుకుంటే మంచిదే.. కానీ ఇలా తింటే ప్రాణాల‌కే ప్ర‌మాదం అట‌..!

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ముఖ్యపాత్రను తాజా పండ్లు పోషిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతారు.. అంతే కాకుండా సీజన్ లో దొరికే తాజా పండ్లను తీసుకుంటే, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాలు దరికి చేరవని అంటారు.. అందుకే ప్రతి రోజు మనకు ప్రకృతిపరంగా లభించే ఏదో ఒక పండును తీసుకోవడం మంచిదట.. ఇకపోతే రోజుకో యాపిల్ తింటున్న మనిషి హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్తుంటారు.. కానీ ఈ యాపిల్ తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించ వలసిన అవసరం ఉందట..

అవేమంటే ముందుగా యాపిల్ ను శుభ్రంగా కడిగి తినాలి. కొందరైతే యాపిల్‌ను ఫ్రిజ్‌లో పెడతారు.. కాని ఇలా చేయకూడదట.. ఒకవేళ ఫ్రిజ్‌లో పెడితే బయటకు తీసిన ఐదు నిమిషాల్లోగా తినాలి, లేదంటే యాపిల్‌లో ఉన్న పోషక పదార్ధాలు నశిస్తాయట. ఇక కొందరైతే యాపిల్ పండుతో పాటుగా అందులోని విత్తనాలను కూడా తినేస్తుంటారు. కానీ ఇలా తినడం చాలా డేంజర్. ఎందుకంటే యాపిల్ గింజలు విషపూరితంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

taking daily one apple is good but do not take them like this

వారు చెబుతున్న‌ ప్రకారం సుమారుగా 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి 15 నుంచి 175 గింజలు తింటే మరణిస్తాడట. అలానే పదేళ్ళలోపు వయసున్న పిల్లలు 50 గింజలు తిన్నా చనిపోతారట. అందుకే యాపిల్ గింజల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి యాపిల్ తింటున్నప్పుడు ఎట్టిపరిస్దితుల్లో గింజలు తినకండని పేర్కొంటున్నారు.

Admin

Recent Posts