హాయ్… హలో..వాట్ ఆర్ యూ డూయింగ్…చూడడానికి ఈ మెసేజెస్ లో తప్పు ఏం లేదు..కానీ మెసేజెస్ చేస్తున్నటైంలోనే తప్పు ఉంది.ముఖ్యంగా మహిళలకు మెసేజ్ చేసే విషయంలో కొన్ని పరిమితులు పాటించడం చాలా అవసరం .లేదంటే చాలా చిన్న విషయాలే పెద్ద పరిణామాలకు దారి తీయొచ్చు.ఈ రోజుల్లో 24గంటలు సోషల్ మీడియా కామన్ థింగ్ అయిపోయింది.అంత మాత్రాన ఎప్పుడుపడితే అప్పుడు చాటింగ్ చేయొచ్చు అనే ఆలోచన మాత్రం సరికాదు.
అర్ధరాత్రి ఆన్ లైన్ లోకి రాగానే మన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఆన్ లైన్ లో కనిపిస్తే వెంటనే hi అని పంపేస్తుంటారు కొందరు.పంపేది ఆడవాళ్లకైతే,కొంచెం ఆలోచించాల్సిన విషయం.అర్ధరాత్రి ఆన్ లైన్ లో ఉన్నారంటే వాళ్లు చాటింగ్ కి ఫ్రీగా ఉన్నారని కాదు… ఆ టైంలో వాళ్లు సోషల్ మీడియాలో వాళ్ల పనులలో ఉండొచ్చు. నేడు ఉద్యోగాల రిత్యా భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉండాల్సి వస్తుంది.సో ఆ టైంలో వాళ్ల భర్తతోనే ఆన్ లైన్ ఛాటింగ్ లో ఉండొచ్చు.ఆన్ లైన్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ వాళ్లు సోషల్ మీడియాలోనే ఉన్నారని అనుకోవడానికి లేదు.