నేడు ఇంటర్నెట్ లో వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు యువతను మానసికంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆధునిక యువత తమ సమయాన్ని అధికంగా ఆన్ లైన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో స్నేహితులతో గడిపేస్తున్నారు. అయితే, వీరు తమ నిజజీవితంలో స్నేహితులను ఏర్పరచుకోలేకపోతున్నారని ఒక స్టడీ తెలుపుతోంది. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చూస్తే సగటున ఒక్కొక్కరికి 250 మందికి తగ్గటం లేదు. అయితే వాస్తవంలో బయట 60 శాతం మంది తమ స్నేహితులకు కేటాయించటానికి సమయం లేదని చెపుతున్నారు. అంతేకాదు, టెక్నాలజీ ఉపయోగించి స్నేహితులను ఏర్పరచుకోవటం తేలికగా వుందని నిజ జీవితంలో ఏర్పరచుకోడానికి అవసరమైన స్కిల్స్ వీరి వద్ద కరువయ్యాయని కూడా సర్వే తేల్చింది.
యువర్స్ అనే పత్రిక ఈ సర్వేని 18 నుండి 80 సంవత్సరాల వయసు కలవారికి నిర్వహించిందని, ఆ సర్వే లో యువతకు గల ఈ సమస్య సరి అయినదేనని, దీనిని పరిష్కరించటానికి లోకల్ క్లబ్ లు ఏర్పరచాల్సిన అవసరం వున్నట్లుగా వారు భావిస్తున్నారని ది డైలీ మెయిల్ పత్రిక వ్యాఖ్యానించింది.
జీవితంలో నిజమైన స్నేహితులుండటం ఎంతో విలువైనదిగా తాము భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో అధిక శాతం తెలిపారు. ఫేస్ బుక్ లో స్నేహితులతో ఛాటింగ్ లకు అలవాటు పడ్డ 18 సంవత్సరాల వయసుకల యువకులు కూడా వాస్తవంలో స్నేహితులను సంపాదించాలంటే 80 సంవత్సరాల వృద్ధులు భావించినట్లు భావిస్తున్నారని సర్వే నిర్వహించిన మేగజైన్ ఎడిటర్ వేలరీ మెకనెల్ తెలిపారు.