lifestyle

కోటి రూపాయలు సంపాదించాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ?

ఫ్రీ గా వొస్తే పినయిల్ బాటిల్ కూడా తాగడానికి సిద్ధం గా ఉండాలి. రోజూ కొలతలతో అన్నం, కూరలు వండాలి, అది ఎలాగంటే నాలుగు దోశలు పట్టే కడుపులోకి 2 దిశలను పంపి మిగిలిన దానిని నీటితో నింపాలి. మంచి మంచి కూరలు వండితే ఎక్కువ అన్నం తింటారు కాబట్టి ఏదో ఒకటి కూర ఎలా పడితే అలా వండాలి, అది కూడా కారం ఎక్కువ వేసి. ఎక్కువ వేపుళ్లు వండితే నూనె అయిపోతుంది కాబట్టి ఎప్పుడో నెలకి ఓ సారి మాత్రమే ఫ్రై చేసినవి తినాలి. చపాతీలు వంటివి వండితే నూనె అయిపోతుందిగా, ఇడ్లీలు, అట్టులు వంటివి వండాలి. వాషింగ్ మెషిన్ అస్సలు వాడ కూడదు, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందిగా.

ఇంట్లో ఒక లైట్ వెయ్యాలి, గదులలో వెయ్యకూడదు, ఒక ఫ్యాన్ మాత్ర‌మే ఉండాలి గదులలో ఉండకూడదు. ఇంట్లో కోడలు ఉంటే తనని ఎప్పుడు అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లమనాలి, దానితో ఇంట్లో అన్నం, బట్టల సబ్బు, ఇంకా గ్యాస్ , షాంపూలు వంటివి చాలా మిగులుతాయి. మన ఇంటికి ఎవరూ వొచ్చిన ఏం వండకుడడు, ఏదో పిచ్చి కూరలు వండి అక్కడ పెట్టి తినమని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏం తినకుండా వెళ్లి పోతారు. మిగిలిన అన్నం, కూరలు పడేయకుండా ఉంచుకుని వాటిని కూడా తినాలి. ఒకరికి కూరలు అన్నం తగ్గించి వండాలి. ఎవరు ఏం ఇచ్చినా ఇంటికి తీసుకు వెళ్లి దాచుకో వాలి గానీ మన ఇంటికి వచ్చిన వారికి ఏం ఇవ్వకూడదు.

which mind set we must have if have to earn 1 crore rupees

ఏ మాయదారి రోగం వచ్చినా govt హాస్పిటల్ లో నే చుపించుకోవాలి. ఎప్పుడు కొత్త బట్టలు వేసుకోకూడదు, అవి దాచుకుని పెళ్లికి లేదా ఏదైనా జనాలు ఎక్కువ వచ్చే పండగల్లో మాత్రమే వేసుకోవాలి. ఇంకా రోజు చిరిగిన పాత బట్టలు వేసుకోవాలి. ఎక్కువ నూనె రాసుకో కూడదు, ఎక్కువ సార్లు స్నానం చెయ్య కూడదు, ఎక్కువ తల స్నానం చెయ్యకూడదు. బట్టల్ని కాస్త సర్ఫు వేసి మాత్రమే ఉతకాలి. ఈ విధంగా చేస్తే మీరు కోటి రూపాయలు ఆస్తి సంపాదిస్తారు, మీ జీతం ఎంత అయినా గానీ.

Admin

Recent Posts