lifestyle

విరాట్ కోహ్లి తాగే నీళ్లు ఏమిటో తెలుసా..? ఖ‌రీదు ఎంతంటే..?

మనం బయటకివెళ్ళినప్పుడు దాహం వేస్తే బిస్లెరి వాటర్ బాటిల్ కొనాలంటే పది సార్లు ఆలోచిస్తాము. మన జాగ్రత్తకోద్ది మనం ఓ బాటిల్ వాటర్ పట్టుకెళ్లాము. అత్యవసర పరిస్థితి వస్తే కానీ కొన‌మ వాటర్ బాటిల్. రైల్వే స్టేషన్లలో, బస్సు స్టాండుల్లో, థియేటర్లలో, మాల్స్ లో..ఇలా ఏ చోటైనా లీటర్ మినరల్ వాటర్ ధర 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్యలో ఉంటుంది. మంచి నీళ్లు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి అత్యవసరం. కానీ మన సెలెబ్రిటీలు మాత్రం ఒక లీటర్ మంచి నీళ్లకు వేళల్లో ఖర్చు చేస్తారు తెలుసా..? విరాట్ కోహ్లీ తాగే నెల్ల బాటిల్ ఖరీదు 600 రూపాయలు. అతను తాగే నీటి బ్రాండ్ ఎవియన్. లీటర్ నీటి బాటిల్ 600 రూపాయలు. అతను ఎక్కడ హోటల్ లో దిగిన ఈ బాటిల్ ఉండాల్సిందే. అలాగే మిగిలిన సినిమా వాళ్ళు, సెలెబ్రిటీలు తాగే నీటి ఖరీదు కూడా వేలల్లోనే ఉంటుంది. మరి వాటిలో ప్రత్యేకత ఏంటి..?

కోనా నిగ‌రి అనే నీళ్ల‌ను ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన‌విగా చెబుతారు. వీటి ధ‌ర 750ఎంఎల్‌కు రూ.27వేలుగా ఉంది. హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. బ్లింగ్‌ హెచ్‌ టూవో కంపెనీ త‌యారు చేసే నీటి ఖ‌రీదు 750 ఎంఎల్‌కు రూ.2680గా ఉంది. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో ఈ నీళ్ల‌ను త‌యారు చేస్తారు. వీన్ అని పిల‌వ‌బ‌డే నీళ్ల‌ను భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచి నీటిని సేక‌రించి త‌యారు చేస్తారు. ఈ నీటి ధ‌ర 750 ఎంఎల్‌కు రూ.1500గా ఉంది. 10 థౌజండ్ బీసీ అనే నీటి ఖ‌రీదు 750మి.లీ కు రూ.950గా ఉంది. హిమాల‌యాల నుంచి వ‌చ్చే నీటితోనే ఈ నీటిని త‌యారు చేస్తారు.

which water virat kohli drinks

ఆక్వా డెకో అనే కంపెనీ త‌యారు చేసే నీటి ఖ‌రీదు 750 ఎంఎల్‌కు రూ.800గా ఉంది. హిమానీ న‌దాల నుంచి సేక‌రించిన నీటితో ఈ నీళ్ల‌ను త‌యారు చేస్తారు. ఎవియాన్ లెస్ బెయిన్స్ అనే ప్రాంతంలో ఉన్న నీటి బుగ్గ నుంచి ఈ నీళ్ల‌ను సేక‌రించి శుద్ధి చేసి విక్ర‌యిస్తారు. ఈ కంపెనీ నీటి ఖ‌రీదు లీట‌ర్‌కు రూ.600 గా ఉంది. మ‌న దేశంలో చాలా మంది సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు, ప్ర‌ముఖులు ఈ నీళ్ల‌ను అధికంగా తాగుతారు. లాక్వెన్ ఆర్టెస్ అనే నీటి ఖ‌రీదు 750 ఎంఎల్‌కు రూ.400గా ఉంటుంది. ద‌క్షిణ అమెరికాలోని ఆండెస్ ప‌ర్వ‌తాల నుంచి సేక‌రించిన నీళ్ల‌తో ఈ నీళ్ల‌ను త‌యారు చేస్తారు.

Admin

Recent Posts