lifestyle

ఇంగ్లిష్ వారు ఎప్పుడూ మైదా, బ్రెడ్‌, మాంసం తింటారు.. వారికి ఏమీ కాదా..?

ఇలాంటి ప్రశ్న చదివిన ప్రతిసారీ ఇదే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. ఏ ఆహారాన్నీ ఇది మంచి ఇది చెడూ. ఇది తినదగ్గదీ ఇది తినకూడనిదీ అని ఏ ఒక్క వ్యక్తో నిర్ణయించలేడు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్రా అన్నట్టుగా…అరాయించుకోగలిగేదంతా ఆహారమే. కానీ ఇక్కడే ఒక ఇక్కడే చిక్కొస్తుంది. అరిగించుకోగలిగేది అంటే? ఈ సృష్టిలో ఏ ఒక్క జీవికీ నిర్దిష్టంగా ఉండదు. ఉదాహరణకి మీ ఇంట్లో రాత్రి భోజనానికి దోశలు చేసారనుకుందాం. భర్త, భార్య, పిల్లాడు ఒకే పరిమాణంలో తినగలరా. లేదా, అదే పరిమాణం ప్రతి రోజూ తినగలరా?

చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తొచ్చిందా..నాన్నకి నాలుగు, అమ్మకి మూడు, అన్నకి రెండు, నాకేమో ఒకటి. సరే..మైదా, ఎర్ర మాంసం దగ్గరికి వద్దాం. ఆహారం, వయసు, మనిషి ఆరోగ్యం, పరిమాణం.. మరీ ముఖ్యంగా భౌగోళిక పరిస్థితులకి అనుగుణంగా ఉంటుంది. అంటార్కిటికాలో జీవించే వ్యక్తికి అప్పడం నంజుకుని పెరుగన్నం తినమంటే బ్రతకడు.

why english people eat maida bread and meat

ఇదీ అంతే.. వారివారి భౌగోళిక పరిస్థితులకనుగుణంగా అది సరైనదే అని నా అభిప్రాయం. నేనైతే అరిగినంత కాలం మైదా తిన్నాను. క్రమంగా తిరుగుట తగ్గి, అరుగుట కూడ తగ్గింది. ఇక రెడ్ మీట్ నా కుటుంబ ఆహారం కాదు కాబట్టి ఎప్పుడూ అటు వెళ్ళలేదు.

Admin

Recent Posts