మీఫోన్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు Google Pay, Paytm ఖాతాలను ఎలా తొలగించాలి? డబ్బు విత్‌డ్రా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా పనులకు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఫోన్‌లో అనేక కీలకమైన డేటా ఉంటుంది. అది ఎవరైనా తీసుకుంటే, పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. బ్యాంక్ ఖాతా ఖాళీ కాకుండా ఉండాలంటే, ఖాతా తొలగించడానికి ఈ దశలను అనుసరించండి.
Paytm ఖాతాను ఎలా తొలగించాలి? Paytm ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, ఖాతా తొలగించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా ఏదైనా ఇతర ఫోన్‌లో Paytm ఇన్‌స్టాల్ చేయాలి. కొత్త ఫోన్‌లో ఖాతా వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, నంబర్‌ను నమోదు చేయండి. ఖాతా తెరిచిన తర్వాత, మెనుపై క్లిక్ చేయండి. ప్రొఫైల్ సెట్టింగ్స్ కు వెళ్లి సేఫ్టీ, ప్రైవసీ విభాగంను ఎంచుకోండి. అన్ని ఫోన్లలో లాగ్ ఔట్ అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యేందుకు ఆప్షన్ ఎంచుకోవాలి. లాగ్ అవుట్ చేసే ముందు నిర్ధారణ అడిగినప్పుడు, అవును అని సెలక్ట్ చేసుకోండి.
Google Pay ఖాతా తొలగింపు.. అదే విధంగా, Google Pay ఖాతాను కూడా తొలగించవచ్చు. క్రింద ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా అకౌంట్ లాగ్ అవుట్ చెయ్యచ్చు.. హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సహాయం.. పై విధానం పాటించకుండానే ఖాతా తొలగించాలనుకుంటే, హెల్ప్‌లైన్ నంబర్ ఉపయోగించవచ్చు. Paytm హెల్ప్‌లైన్ నంబర్ 01204456456 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. Paytm అధికారిక వెబ్‌సైట్లో రిపోర్ట్ ఎ ఫ్రాడ్ ఆప్షన్ ద్వారా కూడా ఖాతా తొలగించవచ్చు. ఈ విధంగా, మీరు మీ ఫోన్ పోయిన సమయంలో ఆ ఫోన్ ల నుంచి గూగుల్ పే, పేటియం అకౌంట్ లను లాగ్ అవుట్ చెయ్యచ్చు.