వినోదం

రంగ‌నాథ్ సినిమాల్లోకి ఎలా వ‌చ్చారో తెలుసా..? ఆయ‌న క‌థ చ‌దివితే ఆశ్చ‌ర్య‌పోతారు..!

1969 లో బుద్దివంతుడు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది… అందులో టాటా..వీడ్కోలూ…గుడ్ బై ఇంక సెలవూ.అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆర్కెస్ట్రా బృందంలో ఒక 20 సంవత్సరాల ఆజానుబాహుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్లు నటిస్తున్నాడు..ఎందుకో తెలియదు కెమెరామెన్ చేతిలోని కెమెరా పదేపదే అతని వైపే ఫోకస్ అవుతుంది..ఏదో తెలియని ఆకర్షణ ఆ యువకునిలో కనిపిస్తోంది…అది గమనించారు ఆ చిత్రదర్శకుడు బాపూ. ఆ యువకుడి గురించి వివరాలు అడిగారు.. ఆ యువకుడి పేరే యస్.యస్.రంగనాథ్..ఆరడుగుల అందగాడు. అందాలరాముడు సినిమా తీస్తున్నప్పుడు బాపు రంగనాథ్ ని రమ్మని కబురు పంపారు. ఆయన వచ్చిన తరువాత అందాలరాముడు సినిమాలో రాముడి పాత్ర వుంది వేస్తారా అన్నారు.

అందుకు రంగనాథ్, సర్ , గిరిబాబు నన్ను హీరోగా చందనఅనే సినిమా తీయబోతున్నారని బాపూతో చెప్పగా.. మంచిది..ఇది చిన్నరోల్ మాత్రమే..హీరోగానే నటించమని సలహా ఇచ్చారు బాపూ. ఆ విధంగా 1974 లో చందన అనే సినిమాలో మొదట హీరోగా నటించారు రంగనాథ్. 1949 జూలై 17 న చెన్నైలో పుట్టిన రంగనాథ్ చిన్నతనంలోనే తాత ఇంటికి దత్తత‌కు వెళ్ళారు. తాత మైసూరు ప్యాలస్ లో రాజుకి వ్యక్తిగత వైద్యుడు. అదీగాక తాత కుటుంబమంతా సంగీత విద్వాంసులే. ఆయన అమ్మమ్మ వీణ వాయించడంలో బంగారు పతకం సాధించారు. అమ్మ జానకమ్మ మంచి తబల విద్వాంసురాలు. అందుకే ఆయనకు సంగీతంపై మక్కువ ఏర్పడింది..క్రమంగా నాటకరంగంలోనికి అడుగుపెట్టారు. తిరుపతిలో కళాశాల విద్య పూర్తి కాగానే వాళ్ళమ్మ అతనిని సినిమాలలో నటించమని ప్రోత్సహించింది. అయితే వారి బంధువులెవరూ సినీరంగంలో లేరు..సినీఫీల్డ్ లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని గ్రహించిన రంగనాథ్ రైల్వే లో TC గా చేరిపోయారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అది ఆయనకు అత్యంత అవసరమైనది కూడా, అయినా సినిమారంగంలోకి అడుగుపెట్టాలనే కోరిక వదలలేదు.

how ranganath came into movies

మొదటి సినిమా చందన విజయవంతం కాకపోయినా మంచి ప్రవర్తన, స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ, అభినయం వున్న రంగనాథ్ ను తెలుగుసినిమా గుర్తించింది. జమీందార్ అమ్మాయి, పంతులమ్మ,ఇంటింటి రామాయణం,దేవతలారా దీవించండి లాంటి సినిమాలు ఆయనను హీరోగా అగ్రస్థానానికి చేర్చాయి. అయితే తెలుగు సినీపరిశ్రమలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రంగనాథ్ నటించిన కథలకు ఆదరణ తగ్గిపోయింది. దాని ప్రభావంతో ఆయన హీరో ప్రస్థానం కూడా కనుమరుగైపోయింది.దాదాపు ఐదారు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డారు. పెద్దకుటుంబం..దాని పోషణభారం ఆయనదే..నెలకు రెండుబస్తాల బియ్యమే కావాలి.. విధిలేని పరిస్థితులలో గువ్వులజంటసినిమా ద్వారా విలన్ గా రెండవ ఇన్సింగ్స్ ప్రారంభించారు. గువ్వలజంట సినిమా విజయవంతం కాకపోయినా విలన్ గా దాదాపు 50 సినిమాలపైగా నటించారు. ఖైదీ సినిమాతో క్యారెక్టర్ నటుడిగా మంచిపేరు రావడంతో క్యారెక్టర్ నటుడిగా స్థిరపడిపోయారు.

ఆరడుగుల నిండైన విగ్రహం.గంభీరమైన కంఠం..అంతకు మించి కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మనసున్న మంచిమనిషి..తమ బంధువుల పిల్లల చదువుల కోసం తన ఇంటినే హాస్టల్ గా మార్చిన మహనీయుడు..దురదృష్టపుశాత్తూ ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో పాలకోసం పై అంతస్తు నుండి క్రిందకు వచ్చి పైకి వెళుతున్న సమయంలో కాలుజారి పడిపోయిన భార్య‌ వెన్నుపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది…అప్పటి నుండీ ఒక చిన్నబిడ్డను సాకినట్లు తన భార్యను సాకారు!! అన్నిరకాల సపర్యలు చేశారు..ఒక మహోన్నతమైన,ఆదర్శవంతమైన భర్తగా నిలిచారు. తెలుగుసినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు..మంచికవిగా కూడా పేరు తెచ్చుకున్నారు..నిజాలను నిర్భయంగా చెప్పే అతను ఆత్మహత్యలను మహా పిరికిచర్యగా అభివర్ణించేవారు. యాథృచ్ఛకంగా తనూ ఆత్మహత్యే చేసుకున్నారు.

చివరి రోజులలో ఒంటరితనం..అతనికి కష్టం అనిపించి ఉండవచ్చు..ఆప్యాయంగా మాట్లాడేవారే కరువైనారు..మనదేశంలో పెద్దవాళ్ళు ఎంత నిరాదరణకు గురవుతున్నారో..రంగనాథ్ జీవితమే ఉదాహరణ.. ఎందుకో రంగనాధ్ ని చూస్తే మన కుటుంబంలో ఒక సభ్యునిగా అనుభూతి కలుగుతుంది.

Admin

Recent Posts