lifestyle

అర‌టి ఆకుల్లోనే భోజ‌నం ఎందుకు చేస్తారో తెలుసా ?

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా బంధువులకు, గ్రామ ప్రజలకు అరిటాకులో భోజనం వడ్డించే వారు. అయితే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది.

పూర్వ కాలంలో మనం ఏ ఇంటికి వెళ్లినా.. వచ్చిన అతిథుల కోసం అరటి ఆకు, మర్రి ఆకు, మోదుగ ఆకులలో భోజనం వడ్డించేవారు. ఇలా ఆకులలో భోజనం చేయడం ఒక సాంప్రదాయమైనప్పటికీ, ఆకులలో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన సంప్రదాయాల ప్రకారం అరటి చెట్టు, రావి చెట్లను దైవ సమానంగా భావించి పూజలు చేస్తారు.

why food in banana leaf meals

ఎంతో పరమపవిత్రంగా భావించే ఈ చెట్ల ఆకులలో భోజనం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఆకులలో భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎవరైనా విషప్రభావం చేసి ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. విష ప్రభావం చేసినప్పుడు అరిటాకులో అన్నం తినడం వల్ల ఆకు మొత్తం నీలి రంగులోకి మారిపోతుంది. అలాగే ఆకుపచ్చని ఆకులలో క్లోరోఫిల్ ఉండటం వల్ల అందులో ఉన్న పదార్థాలు మన శరీరానికి అందుతాయి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులు నయమవుతాయి. కనుక ఈ ఆకులలో భోజనం చేయడం శుభప్రదంగా చెప్పవచ్చు.

Share
Admin

Recent Posts