తనకు మంచి మొగుడు కావాలని చెప్పే కొందరు అమ్మాయిలు, వాళ్లను పెద్దగా పట్టించుకోని వెధవల కోసం పరుగులు తీస్తూనే ఉంటారు, కారణం.. ? తనను వాడు ఒక ఆప్షన్ లా చూస్తాడు, ఎప్పుడైతే తనను తక్కువగా చూస్తున్నాడో వాడినే గెలుచుకోవాలని గట్టి కోరిక మొదలవుతుంది, కాస్త అహం పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనికి బలైపోతారు. ఇదే స్త్రీ తనను పూజించే మంచివాడిని మాత్రం లెక్కే చేయదు, వాడి అస్తిత్వం కూడా గుర్తించదు. ఇందుకే ఒక్కోసారి మంచి స్త్రీలుకూడా వెధవల మీదే మనసు పారేసు కుంటున్నారు. మంచి అబ్బాయిలను మాత్రం ఫ్రెండ్‌జోన్ లో ఉంచుతున్నారు.
అసలు నిజం ఏంటంటే స్త్రీలు సహజసిద్ధంగా ఆధిపత్యం, రహస్యత్వం, భావోద్వేగాలలో గట్టిగా ఉండే వాళ్లను కోరుకుంటారు. మగాళ్లలో కొందరికి ఈ సహజ ప్రవృత్తులను గట్టిగా ఉత్తేజితం చేయడం తెలుసు. కొందరి నడవడికలోని ధైర్యం, శక్తి, మరియు అహంకారం స్త్రీలకు ఆకర్షణ కలిగిస్తుంది.
వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి, అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వీడు అటు ప్రేమ చూపించటం, ఇటు నిర్లక్ష్యం చేయడం ద్వారా స్త్రీ భావోద్వేగాలను చైతన్యవంతం చేస్తాడు. ఇదే కారణంగా కొందరు స్త్రీలు మంచి అబ్బాయిలను కాకుండా, వెధవల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. వీళ్ళు కలిగించే మతిపోగొట్టే ఎమోషన్స్ ఆమెను మరింతగా కట్టిపడేస్తాయి..!!