వైద్య విజ్ఞానం

సర్కోపెనియా (Sarcopenia) అంటే ఏమిటి ? దీన్ని మనం ఎలా అధిగమించాలి ?

సర్కోపెనియా అంటే వయసు పెరిగే కొద్దీ కండరాలు (Muscles) క్షీణించడం, బలహీనంగా మారడం. సాధారణంగా 40-50 ఏళ్లకు ప్రారంభమవుతుంది, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా తక్కువ వయసులోనే వ‌స్తుంది. రామయ్య గారి పరిస్థితి (సర్కోపెనియా Example) రామయ్యగారు 55 ఏళ్లు, యంగ్‌. ఎప్పుడు పొలంలో చాలా కష్టపడ్డారు. కానీ వయసు పెరిగాక హాయిగా కూర్చోవాలనుకున్నారు. వ్యాయామం మానేశారు, పోషకాహారం పట్టించుకోలేదు. చిన్న పని చేసినా తీవ్ర అలసట, మెట్లు ఎక్కలేకపోవడం, కాళ్లు వణుకుతూ నడవడం, జారి పడి కాలి ఫ్రాక్చర్ అయింది. ఇది సర్కోపెనియా ప్రభావం, అంటే కండరాలు బలహీనమైపోవడం వల్ల వచ్చిన సమస్య.

మల్లేష్ గారి మార్పు (సర్కోపెనియాకు ప్రత్యామ్నాయం). మల్లేష్ గారు 50+ ఏళ్లు ఉన్నా రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేస్తారు, మంచి పోషకాహారం తీసుకుంటారు. 60 ఏళ్లు దాటినా చురుగ్గా నడుస్తారు. యువకులకు పోటీగా లిఫ్టింగ్ చేయగలరు! ఇంట్లో పనులు తానే చేసుకుంటారు, కాళ్లు బలంగా ఉంటాయి. జారి పడటం జరగదు, ఎటువంటి ఫ్రాక్చర్ సమస్య ఉండదు.

what is Sarcopenia and how we can overcome it

సర్కోపెనియా నుంచి బయటపడటానికి ఈ 3 చిట్కాలు పాటించండి. ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం (నడక, స్ట్రెచింగ్, లైట్ లిఫ్టింగ్) చేయండి. పెరుగు, గుడ్లు, మటన్, గోధుమలు, బాదం లాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి. జీవితాంతం కదిలే అలవాటు (Active Lifestyle) కొనసాగించడం మంచిది. ఒకసారి కండరాలు బలహీనమైతే తిరిగి రావడం చాలా కష్టం. కాబట్టి, 30-40 ఏళ్ల నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

Admin

Recent Posts