lifestyle

మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?

మోడరన్ టాయిలెట్స్ లో రెండు ఫ్లష్ బటన్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి పెద్దది గా మరొకటి చిన్నది గా ఉంటున్నాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా రెండు ఫ్లష్ బటన్స్ ఉండడాన్ని డ్యూయల్ ఫ్లష్ అని పిలుస్తారు. ఈ రెండు బటన్లు ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి ఉంటాయి. ఈ రెండు బటన్లు వేరు వేరు ఎత్తులలో ఓపెన్ అయి నీటిని బయటకు పంపుతాయి.

చిన్న ఫ్ల‌ష్‌ బటన్ ఎక్కువ ఎత్తులో ఉండి తక్కువ నీటిని పంపుతుంది. పెద్ద బటన్ లోయర్ ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి.. నీటిని అధికంగా బయటకు పంపుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పెద్ద బటన్ నొక్కితే ఆరు నుంచి తొమ్మిది లీటర్ల నీరు లభిస్తుంది. చిన్న బటన్ నొక్కితే నాలుగు లీటర్ల నీరు లభిస్తుంది.

why modern toilets have two flush buttons why modern toilets have two flush buttons

ఘన వ్యర్థాలను ఫ్లష్ చేయడం కోసం పెద్ద బటన్, ద్రవ వ్యర్ధాలను ఫ్లష్ చేయడం కోసం చిన్న బటన్ ఏర్పాటు చేశారు.డుయాల్ ఫ్లష్ ను అమర్చుకోవడం వలన ఒక ఇంట్లో దాదాపు 20 వేల లీటర్ల వరకు ఆదా చేసుకోవచ్చు. సింగల్ ఫ్లష్ కంటే డ్యూయల్ బటన్ ఫ్లష్ అమర్చుకోవడం కొంత ఖరీదు అయినప్పటికీ నీటిని ఆదా చేసుకోవచ్చు.

Admin

Recent Posts