వినోదం

వామ్మో.. లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో ఎన్టీఆర్ కి అన్ని కండిషన్స్ పెట్టిందా..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి వంశంలో మూడవ తరం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. అచ్చం తాత చరిష్మాను పుట్టుకతోనే అందిపుచ్చుకొని తెలుగు ప్రేక్షకులందరికీ అలనాటి నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకి ప్రతిరూపంగా కొనసాగుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ – భరత్ రామ్ ఉన్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5వ తేదీన వివాహ బంధంతో భార్యాభర్తలు అయ్యారు.

ప్రణతి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె. ఇటు ప్రముఖ ప్రాతిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావుకు కుమార్తె. వీరిది ముందు నుంచి పారిశ్రామిక కుటుంబం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఈ సంస్థకు మంచి పట్టు ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. ఎన్టీఆర్ చాలా సార్లు తన భార్య ప్రణతి, పిల్లల గురించి అభిమానులతో పంచుకున్నారు.

lakshmi pranathi put these conditions to jr ntr before their marriage lakshmi pranathi put these conditions to jr ntr before their marriage

అయితే లక్ష్మీ ప్రణతి పెళ్లికి ముందే ఎన్టీఆర్ కి కొన్ని కండిషన్స్ పెట్టిందట. పెళ్లి తర్వాత ఎన్టీఆర్.. తన కోసం రెండు నెలల సమయాన్ని కేటాయించాలని, అంతేకాక ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా బయట తిరగడం తగ్గించాలని డిమాండ్ చేసిందట.

ఎన్టీఆర్ ఫుడ్ విషయంలో కూడా లక్ష్మీ ప్రణతి స్పెషల్ కేర్ తీసుకుంటుంది. అలాగే ఎన్టీఆర్ అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు తన డ్రెస్ విషయంలో కేర్ తీసుకుంటానని కూడా ప్రణతి తెలిపిందట. అలా ఎన్టీఆర్ కి పెళ్లికి ముందే కండిషన్స్ పెట్టి మంచి భార్యగా పేరు తెచ్చుకుంది లక్ష్మి ప్రణతి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవ‌ర 2 చేస్తూ ఉండగా.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా లైన్లో పెట్టేశాడు. అలాగే హిందీలోనూ హృతిక్ రోష‌న్‌తో క‌లిసి ఓ మూవీ చేస్తున్నాడు తార‌క్‌.

Admin

Recent Posts