భారతదేశ ప్రభుత్వం.. అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని ఓ నిర్ణయం తీసుకోగానే.. ఎవరికి వారు వింత వింత గా రియాక్ట్ అయ్యారు. కొందరు తమకు తెల్సిన లా పాయింట్లు తీసి లాజిక్ గా మాట్లాడారు. ఇది వ్యక్తిగత స్వేఛ్చను హరించడమే అంటూ సోషల్ మీడియాలో నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇది అప్పట్లో జరిగింది.
కొందరైతే ఓ అడుగు ముందుకేసి.. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకున్నాయ్.. అక్కడ లేదా అశ్లీలం అంటూ ప్రశ్నించారు. వాత్సాయన కామసూత్ర గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ప్రశ్నలకు గతంలోనే పండితులు సమాధానం చెప్పారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహం అయ్యాక శృంగారంలో పాల్గొంటారు. అది చాలా పవిత్రమైన కార్యం. దీంతో అప్పటి వరకు రెండు శరీరాలుగా ఉన్న వారు ఒక్కటే శరీరం, ఒక్కటే మనసులా మెలుగుతారు. ఇక బిజీ బిజీ కార్యక్రమాల్లో లేదా పనుల్లో పడి శృంగారం అనే పవిత్రమైన కార్యం గురించి మరిచిపోకుండా దాన్ని గుర్తు చేసేందుకే దేవాలయాలపై బూతు బొమ్మలను విగ్రహాల రూపంలో చెక్కడం మొదలు పెట్టారు. సృష్టి ఆగిపోకూడదని, మనిషి తన ధర్మాన్ని నిర్వర్తించాలని అలా బొమ్మలను చెక్కుతూ వస్తున్నారు. ఇదీ.. అందులో ఉన్న అసలు రహస్యం. కాబట్టి దేవాలయాలపై బూతు బొమ్మలు ఉన్నాయని సిగ్గు పడకండి. అది పెద్దలు మనకు అందించిన విజ్ఞానం. కాబట్టి తప్పుగా అనుకోవాల్సిన పనిలేదు.