Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

అయితే శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే చ‌ర్మంపై ప‌సుపు లేదా ఎరుపు రంగులో కురుపులు వ‌స్తాయి. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, పాదాలు, ముక్కుపై ఈ కురుపులు వ‌స్తాయి. ఇవి సైజ్‌లో ఒక్కోసారి 3 ఇంచుల వ‌ర‌కు ఏర్ప‌డ‌తాయి.

అయితే ఈ కురుపుల‌ను చూసి చాలా మంది మొటిమ‌లు లేదా వేడి వ‌ల్ల ఏర్ప‌డిన కురుపులు కావ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ అలా ఏర్ప‌డితే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌రాదు. వెంట‌నే కొలెస్ట్రాల్ టెస్ట్ (లిపిడ్ ప్రొఫైల్‌) చేయించుకోవాలి.

ఇక కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా ఉండ‌దు. దీంతో బీపీ పెరుగుతుంది. అలాగే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వ‌స్తుంటాయి. ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఈ ల‌క్ష‌ణాల‌ను కూడా గ‌మ‌నించాలి. ఇవి కూడా ఉంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు అనుమానించాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక వేళ నిజంగానే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. అలాగే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

Share
Admin

Recent Posts