Kidneys Health : కిడ్నీలు మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మనం రోజూ తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పాటించే అలవాట్ల కారణంగా కిడ్నీలు అనారోగ్యానికి గురవుతుంటాయి. ముఖ్యంగా మనం పాటించే అలవాట్లు కిడ్నీలకు హాని చేస్తాయి. కనుక వాటిని వెంటనే వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లు ఏమిటంటే..
1. చాలా మందికి కొద్దిపాటి నొప్పులు వస్తేనే పెయిన్ కిల్లర్స్‌ను వాడుతుంటారు. ఇలా మితిమీరి పెయిన్ కిల్లర్స్ ను వాడడం వల్ల అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. కనుక డాక్టర్ల సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్ ను వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే అవి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దీంతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
2. ఆహారంలో కొందరు రోజూ ఉప్పును ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఇది కిడ్నీలకు హాని చేస్తుంది. కనుక ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానేయాలి. దీంతో కిడ్నీలు సురక్షితంగా ఉంటాయి.
3. ప్రాసెస్ చేయబడిన ఆహారంలో సోడియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే కిడ్నీలపై భారం పడుతుంది. ఫలితంగా కిడ్నీలు దెబ్బ తింటాయి. కనుక ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తినరాదు. అలాగే ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలి.
4. రోజూ తగినంత నీటిని తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలపై భారం పడుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోవు. ఫలితంగా కిడ్నీలు దెబ్బ తింటాయి. కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తాగాలి. కనీసం 3-4 లీటర్ల నీటిని రోజూ తాగాల్సి ఉంటుంది.
5. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమో.. తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచేందుకు నిద్ర ఉపయోగపడుతుంది. కనుక రోజూ తగినంత నిద్ర పోవాలి.
6. చక్కెర పదార్థాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరిగి ఊబకాయం వస్తుంది. దీంతో బీపీ, షుగర్ వస్తాయి. ఇవి కిడ్నీలకు చేటు చేస్తాయి. కాబట్టి చక్కెర ఉండే పదార్థాలను తినడం తగ్గించాలి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
7. ధూమపానం, మద్యపారం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం, మద్యపానం చేసే వారి మూత్రంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు అలవాట్లను కూడా మానేయాలి.