మానవశరీరం ఒక నిగూడమైన, సంక్లిష్టమైన వ్యవస్థ… ఇప్పటికీ మన శరీరంకి సంబంధిచి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. శరీర భాగాలకు సంభందించి అసాధారణ, ఊహించని నిజాలు తెలుస్తూనే ఉంటాయి… మన శరీరం గురించి మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విషయాలు.. అప్పుడే పుట్టిన శిశువులో సాధారణ మనిషి కన్నా 60 ఎముకలు అదనంగా పెరుగుతూ ఉంటాయి.ఎదుగుతున్న క్రమంలో ఈ ఎముకలన్నీ కలిసిపోయి సంపూర్ణ అస్తిపంజరం ఏర్పడుతుంది.
చెమట పట్టినప్పుడు శరీరం నుండి దుర్గంధం వస్తుంది. వాస్తవానికి చెమట ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది. మన శరీరంపై ఉండే బ్యాక్టీరియా కారణంగా చెమట పుట్టినప్పుడు చెడువాసన వస్తుంది. కండలు బలమైన కండరాలు అనుకుంటే పొరబడినట్టే.. మన దవడలో ఉండే నమలడానికి మనకు సహాయం చేసే కండరం మన శరీరంలో అతి పెద్దది. వేలి ముద్రల మాదిరిగానే నాలుక పైన కూడా వివిధ ముద్రలుంటాయి.అవి ఒక మనిషితో ఒక మనిషికి పోలిక లేకుండా ఉంటాయి..కాబట్టి భవిష్యత్ లో ఫింగర్ ప్రింట్స్ లాగానే ,నాలుక ప్రింట్స్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు..
మెలకువగా ఉన్న మనిషి మెదడు ఒక చిన్న బల్బును వెలిగించేంత శక్తి కలిగి ఉంటుంది…మనిషి ఎముకలు ఉక్కుకన్నా బలమైనవి.. ఎప్పుడైనా తాగే విషయంలో పోటీ పెట్టుకున్నట్టయితే నలుపు రంగు కళ్లు ఉన్నవారికంటే నీలం రంగు కళ్లు ఉన్న వాల్లకు త్వరగా తాగే శక్తి ఎక్కువగా ఉంటుంది…కావాలంటే ఈ సారి గమనించండి.