తల తిరగడం అనేది సహజంగానే కొందరికి అప్పుడప్పుడు వస్తుంటుంది. అలాంటి సమయాల్లో కొందరు స్పృహ తప్పి పడిపోతుంటారు. అయితే ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లోపలి చెవిలో అధికంగా ద్రవాలు పేరుకుపోతే తల తిరగడం సమస్య వస్తుంది. ఇది కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీంతో వినికిడి లోపం, చెవుల్లో రింగుమని శబ్దాలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే మినియెర్స్ డిసీజ్ అంటారు. ఈ విధంగా అవడం వల్ల తల తిరగడం వస్తుంది.
2. కార్డియో మయోపతి, హార్ట్ ఎటాక్, హార్ట్ అరిథ్మియా అనే సమస్యలు ఉన్నవారిలోనూ తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వీరిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు. మెదడు, లోపలి చెవికి రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో తల తిరిగినట్లు అనిపిస్తుంది.
3. పార్కిన్సన్ వ్యాధి, మల్టిపుల్ స్లెరాసిస్ అనే సమస్యలు ఉన్న వారికి కూడా తల తిరిగినట్లు అనిపిస్తుంది.
4. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐరన్ లోపించడం వల్ల కూడా తల తిరుగుతుంటుంది. దీంతోపాటు అలసట, నీరసం, పాలిపోయిన చర్మం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అందువల్ల తల తిరగడం అనే సమస్య ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీస్తుంది. కనుక తల తిరగడం అనే సమస్య ఉంటే అలసత్వం వహించరాదు.