క్యాన్సర్ రోగులకు మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

మ‌జ్జిగ‌ను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. పెరుగు తినేందుకు ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా మజ్జిగ సేవిస్తుంటారు. మజ్జిగ సులభంగా జీర్ణమవుతుంది. ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంటను త‌గ్గిస్తుంది. రక్తహీనతను త‌గ్గించి ఆక‌లిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , అవసరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. అందువ‌ల్ల మ‌జ్జిగ‌ను రోజూ సేవించాలి.

క్యాన్సర్ రోగులకు మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

మజ్జిగలో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ద్ర‌వాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీత‌ల పానీయాల‌ను తాగ‌డం కంటే మజ్జిగను తాగడం మంచిది. మజ్జిగ పుల్లని రుచిని కలిగి ఉంటుంది.అయితే ఇది శరీరానికి, కణజాలానికి పోషకాల‌ను అందిస్తుంది.

క్యాన్సర్ రోగులకు చికిత్స సమయంలో, చికిత్స తర్వాత సమతుల్య ఆహారంగా మ‌జ్జిగ ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాన్సర్ చికిత్స ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది. దీంతో అత‌ను రోజువారీ ప‌నులు చేయ‌లేడు. ఈ పరిస్థితిలో క్యాన్సర్ రోగికి మజ్జిగ చాలా బాగా ప‌నిచేస్తుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

క్యాన్సర్ చికిత్స‌కు వాడే మందుల వ‌ల్ల రోగుల‌కు విరేచ‌నాలు వ‌స్తుంటాయి. అయితే వారు మ‌జ్జిగ‌ను తాగితే విరేచ‌నాల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

క్యాన్సర్ చికిత్స వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల్లో ఒక‌టి డీహైడ్రేష‌న్‌. కీమోథెర‌పీ, రేడియేష‌న్ వ‌ల్ల జ్వ‌రం, వాంతులు, విరేచ‌నాలు లేదా అధిక మూత్ర విస‌ర్జ‌న వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతోపాటు డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తారు. అయితే మ‌జ్జిగ వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో శ‌రీరానికి ఎల‌క్ట్రోలైట్స్ ల‌భిస్తాయి. చురుకుద‌నం వ‌స్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అందువ‌ల్ల క్యాన్స‌ర్ రోగులు చికిత్స స‌మ‌యంలో, చికిత్స త‌రువాత మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మేలు.

Share
Admin

Recent Posts