గర్భం దాల్చిన మ‌హిళ‌లు ఎన్నో నెల త‌రువాత పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగాలో తెలుసా ?

కుంకుమ పువ్వును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. ఇది అద్భుత‌మైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల నాన్ వెజ్ వంట‌ల్లో దీన్ని ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం కుంకుమ పువ్వులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ విలువ‌లు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

గర్భం దాల్చిన మ‌హిళ‌లు ఎన్నో నెల త‌రువాత పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగాలో తెలుసా ?

కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి గ‌ర్భిణీలు తాగడం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బిడ్డ‌కు అనేక పోష‌కాలు అందుతాయి. దీంతో బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. పుట్టుక‌తో లోపాలు రాకుండా ఉంటాయి. అందువ‌ల్ల డాక్ట‌ర్లు సైతం ఈ విధంగా తాగ‌మ‌ని సిఫార‌సు చేస్తుంటారు.

అయితే కుంకుమ పువ్వును గ‌ర్భిణీలు ఎన్నో నెల నుంచి పాల‌లో క‌లిపి తాగాలో చాలా మందికి తెలియ‌దు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం 4 నెల‌లు పూర్త‌య్యాకే 5వ నెల వ‌చ్చాక మాత్రమే పాల‌లో కుంకుమ పువ్వును క‌లిపి తాగాలి. 5వ నెల‌లో బిడ్డ క‌ద‌లిక‌లు త‌ల్లికి బాగా తెలుస్తుంటాయి. ఆ స‌మ‌యంలో కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగాల్సి ఉంటుంది.

కుంకుమ పువ్వు దారం ఒక‌టి తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో క‌లిపి రోజుకు ఉద‌యం, సాయంత్రం రెండు సార్లు తాగ‌వ‌చ్చు. రాత్రి నిద్ర‌కు ముందు తాగాలి. ఉద‌యం అయితే బ్రేక్ ఫాస్ట్ చేశాక తాగాలి.

పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగితే బిడ్డ అందంగా పుడుతుంద‌ని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా ఇది నిరూప‌ణ కాలేదు. అయిన‌ప్ప‌టికీ పాల‌లో కుంకుమ పువ్వును క‌లిపి తాగడం వ‌ల్ల బిడ్డ‌కు, త‌ల్లికి ఆరోగ్య‌ప‌రంగా ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

పాల‌లో కుంకుమ పువ్వు క‌లిపి తాగ‌డం వ‌ల్ల హైబీపీ రాకుండా చూసుకోవ‌చ్చు. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఉద‌యం వికారం, వాంతులు రాకుండా ఉంటాయి. మూడ్ మార‌కుండా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. క‌నుక ఈ ప్ర‌యోజ‌నాల కోసం గ‌ర్భిణీలు కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts