Health Tips : హార్ట్ ఎటాక్ లు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. అవి ఎప్పుడైనా రావచ్చు. కానీ రాకుండా ఉండడం కోసం రోజూ అన్ని జాగ్రత్తలనూ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం.. వేళకు నిద్రపోవడం చేయాలి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించవచ్చు.
అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన మొదటి ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో రోగికి ఎలాంటి చికిత్సను అందించాలి ? ఏ విధంగా వ్యవహరించాలి ? అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. దీంతో అలాంటి సందర్భాల్లో చాకచక్యంగా వ్యవహరించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు. మరి గోల్డెన్ అవర్‌లో ఏం చేయాలంటే..
గోల్డెన్ అవర్‌లో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ముందుగా వైద్య సహాయం కోసం ఆంబులెన్స్ ను పిలవాలి. ఆ పని చేశాక రోగిని వెల్లకిలా పడుకోబెట్టి.. అతని ఛాతిపై చేత్తో పిడికిలిలా చేసి ఒత్తిడిని నెమ్మదిగా కలిగిస్తూ అలాగే ప్రెస్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో 10 సెకన్లకు ఒకసారి నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాసను అందించాలి. ఇలా 2 నిమిషాల పాటు చేయాలి.
ఈ విధంగా చేయడాన్ని సీపీఆర్ అంటారు. దీని వల్ల రోగికి ప్రాణాపాయం తప్పుతుంది. అపస్మారక స్థితికి చేరకుండా ఉంటారు. ఆంబులెన్స్ రాగానే తేలికపాటి చికిత్సతతో హాస్పిటల్‌కు తరలించవచ్చు. అప్పుడు కొద్దిగా ఆలస్యం అయినా ప్రమాదం ఉండదు. అందువల్ల గోల్డెన్ అవర్ సమయంలో ఏం చేయాలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎవరి ప్రాణాలను అయినా సరే రక్షించవచ్చు.