Snake Gourd : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో పొట్ల కాయలు ఒకటి. కొందరు వీటిని రక రకాలుగా కూరలు చేసుకుని తింటారు. అయితే పొట్లకాయలను సాధారణంగా చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటితో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పొట్లకాయలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పొట్లకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు సురక్షితంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
2. పొట్లకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. పొట్లకాయల్లో విటమిన్లు ఎ, బి6, సి, ఇ లతోపాటు అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, మాంగనీస్, అయోడిన్‌లు.. వీటిల్లో అధికంగా ఉంటాయి. వీటివల్ల పోషణ లభిస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
4. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ పొట్లకాయలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. లేదా రోజూ పొట్లకాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులోతాగవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ బరువును తగ్గిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. కొవ్వును కరిగించేందుకు సహాయ పడుతుంది.
5. పొట్లకాయల జ్యూస్‌ను తాగడం వల్ల కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
6. పొట్లకాయలను తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది.
7. హైబీపీ ఉన్నవారు రోజూ పొట్లకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. అలాగే మహిళలు పీసీవోఎస్ సమస్య నుంచి బయట పడవచ్చు.