వైద్య విజ్ఞానం

గర్భధారణ సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందా ? ఏ మాత్రం ఆలస్యం చేయకండి !

సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో రోజురోజుకు గర్భాశయం పరిమాణం పెరగడం చేత ఒత్తిడి అధికంగా ఊపిరితిత్తులపై పడటం వల్ల చాలామందిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మరికొందరిలో చాతిలో మంట నొప్పి కలిగి ఉంటుంది.ఈ విధంగా ఛాతిలో నొప్పి కలిగి ఉండటం చేత మహిళలు ఎంతో కంగారుపడుతూ ఉంటారు.అయితే గర్భం దాల్చిన మహిళలు తరచూ ఛాతిలో నొప్పిగా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.

గర్భం దాల్చిన మహిళలు గర్భాశయం పై అధిక ఒత్తిడి పడటం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే ఛాతిలో మంటగా ఉంటుంది. అయితే ఇది ప్రసవం అయ్యేవరకు మహిళలను వెంటాడుతూనే ఉంటుంది.అయితే ఈ విధంగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి నొప్పి నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

if pregnant women have chest pain then beware

గర్భం దాల్చిన మహిళలకు ఛాతిలో అధికంగా నొప్పి ఉంటే నిమ్మకాయ రసంలోకి కొద్దిగా నల్లఉప్పు కలుపుకుని తాగడం వల్ల తొందరగా నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా పలుచని మజ్జిగలోకి కాస్త ఉప్పు వేసుకుని తాగిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా గర్భం దాల్చిన మహిళలలో రక్తపోటు సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే తరచూ బిపి చెకప్ చేయించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఈ విధమైన చిట్కాలను పాటిస్తున్నప్పటికీ వారిలో అధికంగా నొప్పి ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.

Admin

Recent Posts