Gas Trouble Problem : మనం ప్రతిరోజూ మన శరీరానికి తగినంత శక్తి లభించడం కోసం భోజనం చేస్తూ ఉంటాం. మనం ప్రతిరోజూ ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. లేదంటే నీరసం వచ్చి మన పనులను మనం చేసుకోలేకపోతూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలన్న సంగతి మనకు తెలిసిందే. భోజనం చేసేటప్పుడు మనం ఎలాగైతే నియమాలను పాటిస్తామో భోజనం చేసిన తరువాత కూడా మనం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. భోజనం చేసిన తరువాత ఈ నియమాలను పాటించకపోతే మనం వివిధ రకాల జీర్ణసమస్యల బారిన పడే అవకాశం ఉంది. చాలా మంది భోజనం చేసిన తరువాత వెంటనే నిద్ర పోతారు. అలాగే కాళ్లు చాపి కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాక గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం భోజనం చేసిన తరువాత కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
భోజనం చేసిన తరువాత చేయకూడని పనులు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తరువాత చాలా మంది ధూమపానం చేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. భోజనం చేసిన తరువాత చేసే ధూమపానం సాధారణం కంటే పదిరెట్ల ఎక్కువ హానిని కలిగిస్తుంది. ధూమపానం చేయడం వల్ల కలుషితమైన ఆక్సిజన్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో దోహదపడుతుంది. దీంతో కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే భోజనం చేసిన వెంటనే నిద్ర కూడా పోకూడదు. భోజనం చేసిన వెంటనే నిద్ర రావడం సహజం. అయినప్పటికి భోజనం చేసిన తరువాత నిద్రపోకూడదు. ఇలా నిద్రపోవడం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. దీంతో ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు.
భోజనం చేసిన తరువాత స్నానం చేయాల్సి వస్తే కనీసం గంట తరువాత చేయాలి. భోజనం చేసిన తరువాత మనం తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. మనం భోజనం చేసిన తరువాత స్నానం చేయడం వల్ల శక్తి అంతా మన శరీరం చల్లబడడానికే అవసరమవుతుంది. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక భోజనం చేసిన తరువాత వెంటనే స్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తరువాత వెంటనే టీ తాగకూడదు. టీ తాగడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించులేకపోతుంది. భోజనం చేసిన తరువాత టీని తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రక్తహీనత, అలసట, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక భోజనం చేసిన తరువాత టీ ని తాగకూడదు. అలాగే భోజనం చేసిన తరువాత పండ్లను తినకూడదు.
పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి భోజనం చేసిన తరువాత వీటిని తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా భోజనం చేసిన తరువాత చల్లటి నీటిని తాగకూడదు. చల్లటి నీటిని తాగడం వల్ల మన జీర్ణాశయంలో ఉండే జీర్ణ రసాలు చల్లబడతాయి. దీంతో మనం తిన్న ఆహారం చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. ఆహారం ఆలస్యంగా జీర్ణమవ్వడం వల్ల గ్యాస్, అజీర్తి, ఎసిడిటి, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక భోజనం చేసిన తరువాత గంట వరకు నీటిని తీసుకోకూడదు. భోజనం చేసిన తరువాత ఈ నియమాలను పాటించడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.