వైద్య విజ్ఞానం

పాదాల్లో వాపులు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఎంతో మంది పాదాల వాపుల తో ఇబ్బంది పడుతుంటారు. అయితే మరి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి..? ఈ సమస్య ప్రమాదమా లేదా ..? ఇలా ఎన్నో విషయాలు మీకోసం. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే తెలుసుకోండి. పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చున్న లేదా నిలబడటం వల్ల కూడా వస్తాయి. ఏది ఏమైనా వీటిని తగ్గించడం కొంచెం కష్టమే.

వెరికోసీల్ వెయిన్స్ సమస్య ఉన్నవారికి ఎక్కువ గంటలు కూర్చుంటే వాపుల సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్న వారికీ తీవ్రంగా నొప్పి ఉండడమే కాక చర్మం రంగు కూడా మారిపోవడం జరుగుతుంది. వాపు ఉన్న చోట ఎప్పుడైనా నొక్కినప్పుడు వెంటనే ఆ భాగం తిరిగి యధా స్థితికి వచ్చేస్తుంది. అదే గుంటలాగ పడిపోయి, కొద్ది క్షణాల వరకు ఆ భాగం లోపలికి అలాగే ఉంటే అది తీవ్రమైన సమస్యగా భావించాలి గుర్తుంచుకోండి. దీనితో ఇది కిడ్నీ,గుండె, కాలేయం భాగాల లో ఏదైనా సమస్య ఉన్నట్టు. లేదా హైపో థైరాయిడిజం ఉన్నట్టు కూడా అనుకోవచ్చు.

if you have feet swelling then know what it means

ఇది ఇలా ఉంటె ఆకలి తగ్గడం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలగడం, చర్మం రంగు మారడం కనుక జరిగితే పాదాల్లో వాపు ఎక్కువ అయి ఈ బాధ తీవ్రంగా ఉంటె ఇవి వస్తాయి. ఎప్పుడైనా పరిస్థితి తీవ్రంగా ఉంటె డాక్టర్ ని సంప్రదించండి. పాదాలను కొంచెం ఎత్తులో ఉంచి కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలానే కాలి కింది భాగం లో తల దిండు పెట్టుకోవడం లాంటివి చేస్తే మంచిది.

Admin

Recent Posts