వైద్య విజ్ఞానం

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Heart Attack : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారికే ఎక్కువ‌గా గుండె జ‌బ్బులు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వ‌య‌స్సు వారు సైతం హార్ట్ ఎటాక్ లకు గుర‌వుతున్నారు. దీంతో ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఇది చాప కింద నీరులా విస్త‌రిస్తుంది. క‌నుక దీన్ని వ‌చ్చే ముందే గుర్తించాలి. అప్పుడు ప్రాణాలు పోకుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు. ఇక హార్ట్ ఎటాక్ బారిన ప‌డే వారికి ముందుగానే ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే..

సాధార‌ణంగా అజీర్ణం, గ్యాస్ వ‌చ్చిన‌ప్పుడు పొట్ట పై భాగంలో బ‌రువుగా ఉంటుంది. ప‌ట్టేసిన‌ట్టు అనిపిస్తుంది. కానీ ఇలా కాకుండా ఛాతిపై అదిమిప‌ట్టిన‌ట్లు బ‌లంగా ఒత్తిడి ఉంటే గ‌న‌క మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుందేమోన‌ని అనుమానించాలి. ఛాతిపై బ‌రువు పెట్టిన‌ట్లు ఉంటే అప్పుడు శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టంగానే ఉంటుంది. ఈ రెండు ల‌క్ష‌ణాలు ఉంటే అది త‌ప్ప‌నిస‌రిగా హార్ట్ ఎటాక్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. కనుక ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు అజాగ్ర‌త్త‌గా ఉండ‌రాదు. త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

if you have these symptoms then it might be heart attack

ఇక వేడి వాతావ‌ర‌ణంలో లేదా తేమ ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో ఉంటే మ‌న‌కు స‌హ‌జంగానే ఎక్కువ‌గా చెమ‌ట‌లు ప‌డ‌తాయి. కానీ అలా కాకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా స‌రే.. కొంద‌రికి విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌డుతుంటాయి. ఇది హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి ఒక సంకేతం. క‌నుక ఇలా ఎవ‌రిలో అయినా ఉంటే.. వెంట‌నే జాగ్ర‌త్త ప‌డాలి.

అలాగే ఎడ‌మ వైపు ద‌వ‌డ లేదా ఎడ‌మ భుజం త‌ర‌చూ నొప్పిగా ఉంటున్నా.. కాసేపు న‌డిచినా తీవ్రంగా అల‌సి పోతున్నా.. శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉన్నా.. వెంట‌నే అనుమానించాలి. వాస్త‌వానికి ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని చెప్పేందుకు సంకేతాలు. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఒక‌వేళ ఏదైనా స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలితే ముందుగానే జాగ్ర‌త్త ప‌డిన వారం అవుతాము. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాలు పోకుండా కాపాడుకోవ‌చ్చు.

Admin

Recent Posts