హెల్త్ టిప్స్

Coconut Water : ఈ సమస్యలు ఉంటే.. కొబ్బరి నీళ్ళని అస్సలు తీసుకోకూడదు..!

Coconut Water : ఎక్కువగా చాలామంది నీళ్లతో పాటుగా, ఇతర లిక్విడ్స్ ని కూడా తీసుకుంటారు. వేసవికాలం వచ్చిందంటే, కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆరోగ్య పరిస్థితులను బట్టి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. కొంత మందికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన హాని కలుగుతుంది. మేలు కంటే కూడా వాళ్ళకి ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు, కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. కొబ్బరి నీళ్లు తాగితే, శరీరం కూల్ అవుతుంది. అధిక వేడి వలన వచ్చే సమస్యల్ని దూరం చేస్తుంది.

కొబ్బరి నీళ్ల‌ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కువ పరిమాణంలో తాగడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. నష్టాలే ఎదుర్కోవాలి. మరి కొబ్బరినీళ్ళని ఎవరు తీసుకోకూడదు, ఏ సమయంలో తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకుందాం. అతి సారంతో బాధపడే వాళ్ళు, కొబ్బరినీళ్ళని తీసుకోకూడదు. దీంతో ఉదర సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి క‌చ్చితంగా ఆ సమస్యలతో బాధపడే వాళ్ళు కొబ్బరినీళ్ళని తీసుకోకుండా ఉండడం మంచిది.

people with these health problems should not take coconut water

జలుబుతో బాధపడే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండాలి. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్ళు, అస్సలు కొబ్బరినీళ్ళని ముట్టుకోవద్దు. అధిక రక్తపోటు తో బాధపడే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళని తీసుకోవద్దు. రక్తపోటు కి సంబంధించి మందులు వాడుతున్నట్లయితే, కచ్చితంగా డాక్టర్ని సంప్రదించి, ఆ తర్వాత కొబ్బరినీళ్ళని తీసుకోండి.

శస్త్ర చికిత్స చేయించుకునే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళని తీసుకోకూడదు. వైద్యుల్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా కొబ్బరినీళ్లు తీసుకోకూడదు. పొత్తికడుపు ఉబ్బరంతో బాధపడే వాళ్ళు, కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండటం మంచిది. ఇక ఏ సమయంలో తీసుకుంటే మంచిదనే విషయానికి వచ్చేస్తే, కొబ్బరి నీళ్ళని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. ప్రతిరోజు రెండు నుండి మూడు కప్పుల కొబ్బరి నీళ్ల ని తీసుకోవచ్చు.

Admin

Recent Posts