Lunula : మీ చేతి గోర్ల‌పై ఉండే ఈ ఆకారాన్ని బ‌ట్టి.. మీకున్న వ్యాధులు ఏమిటో ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Lunula : మ‌న చేతి గోళ్ల‌ను చూసి మ‌న ఆరోగ్యం ఎలా ఉందో చెప్ప‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కొంద‌రి గోళ్ల‌ మీద తెల్ల గీత‌లు ఉంటాయి. కొంద‌రి గోళ్లు వేరే రంగులో ఉంటాయి. అయితే సాధార‌ణంగా అంద‌రి చేతి గోళ్ల‌ మీద అర్ధ‌చంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఈ లునులా భాగం మ‌న శ‌రీరంలోని అతి సున్నిత‌మైన భాగాల‌లో ఒక‌టి. ఒక వేళ ఈ భాగం క‌నుక దెబ్బ‌తింటే మ‌న గోరు పూర్తిగా నాశ‌నం అయిపోతుంద‌ట‌. కొంద‌రిలో ఈ లునులా పెద్ద‌గా ఉంటుంది. కొంద‌రిలో చిన్న‌గా ఉంటుంది. కొంద‌రిలో అస‌లు ఉండ‌దు. కొంద‌రిలో గోళ్ల‌పై గీత‌లు, మ‌చ్చ‌లు కూడా ఉంటాయి. మ‌న గోళ్ల‌ను చూసి మ‌న ఆరోగ్య స్థితిని, మ‌నకు రాబోయే వ్యాధుల‌ను కూడా చెప్ప‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎవ‌రి చేతి గోళ్ల‌ మీద లునులా లేక‌పోతే వారు పౌష్టికాహార లోపం, థైరాయిడ్ గ్రంథి లోపాల‌తో, ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అర్థం. అంతే కాకుండా దీని వ‌ల్ల త‌ర‌చూ ఆందోళ‌న‌కు గురి అవ్వ‌డం, బ‌రువు పెర‌గ‌డం, జుట్టు రాల‌డంవంటి స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డ‌తార‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఎవ‌రికైతే లునులా పెద్ద‌గా ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి జీర్ణ‌శ‌క్తి, థైరాయిడ్ గ్రంథులు బాగా ప‌ని చేస్తున్నాయ‌ని అర్థం. ఒకవేళ ఈ లునులా నీలి రంగులో లేదా పూర్తిగా పాలిపోయిన‌ట్టు ఉంటే వారు త్వ‌ర‌లోనే డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డబోతున్నార‌ని అర్థం. ఈ లునులా బాగా చిన్న‌గా ఉంటే వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి చాలా తక్కువ‌గా ఉంద‌ని, వారు అజీర్తితో బాధ‌ప‌డుతున్నార‌ని, వారి శ‌రీరంలో వ్య‌ర్థాలు బాగా పేరుకుపోయాయ‌ని, ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయ‌ని అర్థం.

if you have this type of Lunula then know the diseases of you
Lunula

అలాగే కొంద‌రిలో గోళ్ల‌ మీద తెల్ల‌ని గీత‌లు క‌న‌బ‌డి త‌రువాత మాయ‌మై పోతాయి. ఇలా గీత‌లు క‌న‌బ‌డితే వారు త‌గినంత ఆహారం తీసుకోవ‌డం లేద‌ని, శ‌రీరంలో కాల్షియం, జింక్ లెవల్స్ త‌క్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం. అదే విధంగా మ‌న చేతికి ఉన్న ప‌దివేళ్ల‌ల్లో క‌నీసం ఎనిమిది వేళ్ల‌కు లునులా ఉండాలి. ఎనిమిది కంటే త‌క్కువ‌గా ఉంటే వారిలో విట‌మిన్ల లోపం, ప్రోటీన్ల లోపం ఉంద‌ని, వారికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ అంద‌డం లేద‌ని అర్థం. ఇలాంటి వారు రోజూ వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. కొంద‌రిలో గోళ్లు పాలిపోయిన‌ట్టుగా ఉంటాయి. అలాంటి వారిలో ఎర్ర ర‌క్త క‌ణాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం.

కొంద‌రిలో గోర్లు ప‌సుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు ప‌సుపు రంగులో ఉంటే వారిలో ఫంగ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ లు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని అర్థం. ఎక్కువ‌గా నెయిల్ పాలిష్ ల‌ను ఉప‌యోగించే వారిలో కూడా గోర్లు ప‌సుపు రంగులో ఉంటాయి. ఇలా గోర్లు ఎక్కువ రోజులు క‌నుక ప‌సుపు రంగులో ఉంటే వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. అలాగే కొంద‌రి గోర్ల మీద న‌ల్ల‌ని పొడ‌వైన గీత‌లు ఉంటాయి. ఇలా గీత‌లు ఉంటే క‌నుక అవి మెల‌నోమా అనే చ‌ర్మ క్యాన్సర్ కు సంకేతం. కొంద‌రిలో గోర్లు ప‌గిలిపోతాయి. అలాంటి వారిలో చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అర్థం. ఈ విధంగా మ‌న గోర్ల‌ను బ‌ట్టి మ‌న ఆరోగ్య స్థితిని అంచ‌నా వేయ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts