Peanuts : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో పల్లీలు కూడా ఒకటి. వీటినే వేరు శనగలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పల్లీలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. అయితే వీటిని కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మాత్రం తినకూడదు. వీటిని తినడం వల్ల వారికి హాని కలుగుతుంది. ఎలాంటి వ్యాధులతో బాధపడే వారు పల్లీలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పల్లీలలో ఐరన్, జింక్, పొటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని వానాకాలం, చలికాలం తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలను మనం ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. డ్రై ఫ్రూట్స్ ను కొనుగోలు చేసి తినలేని వారు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిని పేదవారి బాదం అని కూడా అంటారు. పల్లీలను ఉడికించుకుని, వేయించుకుని తింటూ ఉంటాం. పల్లీలను వేయించడం వల్ల వాటిలో క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. వేయించిన పల్లీలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఉడకబెట్టిన పల్లీలను తినడం వల్లే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
వీటిని తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. పల్లీలను రోజూ ఒక గుప్పెడు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో వేడి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. పల్లీలను అధికంగా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు తగ్గుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా పల్లీలను ఎసిడిటీ సమస్య ఉన్న వారు తినకూడదు.
అలాగే కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు వీటిని తినకూడదు. వీరు పల్లీలను తినడం వల్ల నొప్పులు, మంట అధికమవుతాయి. అలాగే కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా వీటిని తినకూడదు. వీటిని తినడం వల్ల కాలేయం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. అదే విధంగా పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగకూడదు. పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మందగిస్తుంది. అజీర్తి సమస్య కూడా వస్తుంది. నోటి దుర్వాసన కూడా పెరుగుతుంది. కనుక పల్లీలను తిన్న 20 నుండి 30 నిమిషాల వరకు నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈవిధంగా పల్లీలను తినడంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.