Liver Cancer Symptoms : మనల్ని వేధించే ప్రాణాంతకమైన వ్యాధుల్లలో క్యాన్సర్ కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. అలాగే కొందరిలో ఇది వంశపారపర్యంగా కూడా వస్తుంది. నేటి తరుణంలో మనలో చాలా మంది వివిధ రకాలు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. వాటిలో కాలేయ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. అయితే ఇతర క్యాన్సర్ ల లాగా మొదటి దశలోనే దీనిని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. మూడు లేదా నాలుగవ దశలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యాధి నిర్ధారణ అవుతుందని వారు తెలియజేస్తున్నారు.
ఈ కాలేయ క్యాన్సర్ గుర్తించే సరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆహారం తీసుకునే సమయంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా మాత్రమే కాలేయ క్యాన్సర్ ను మనం ముందుగా గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. అలాగే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉంటాయి. కాలేయ క్యాన్సర్ బారిన పడినప్పుడు మనలో కనిపించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఆకలి తక్కువగా ఉంటుంది. ముందు తీసుకున్నంత ఆహారాన్ని తీసుకోలేరు. అలాగే కొద్దిగా ఆహారాన్ని తీసుకున్నప్పటికి కడుపులో నొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే విధంగా విపరీతంగా బరువు తగ్గుతారు. పొత్తి కడుపు వాచినట్టుగా ఉంటుంది.
తరచూ కామెర్ల బారిన పడతారు. అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడతారు. తరచూ పొత్తి కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కాలేయ క్యాన్సర్ బారిన పడిన వారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాలతో బాధపడే వారు వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా ఈ లక్షణాలను బట్టి మనం మొదటి దశలోనే ఉన్న కాలేయ క్యాన్సర్ ను సులభంగా గుర్తంచవచ్చని దీనితో ప్రాణాపాయం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.