Malaria Symptoms: వర్షాకాలంలో సహజంగానే చాలా మందికి వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది దోమలు కుట్టడం వల్ల ఎక్కువగా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుడితే మలేరియా వ్యాప్తి చెందుతుంది. మలేరియా ఉన్న దోమ కుడితే మనకు మలేరియా వస్తుంది. ఈ క్రమంలోనే మలేరియా వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మలేరియా వచ్చిన వారికి జ్వరం సహజంగానే ఉంటుంది. మలేరియా వచ్చాక చాలా మందికి ముందుగా జ్వరం వస్తుంది.
2. మలేరియా వచ్చిన వారికి తలనొప్పి బాగా ఉంటుంది. కొందరికి జ్వరంతోపాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వణికిపోతారు.
3. మలేరియా వచ్చిన వారు చాలా మంది చలికి వణికినట్లు వణుకుతారు. కొందరికి ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బ్లాంకెట్లు కప్పుకున్నా చలి ఆగదు. ఇలా జరిగితే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
4. మలేరియా వచ్చిన వారికి జ్వరం, చలి ఉన్నా చెమట వస్తుంటుంది. విపరీతమైన చెమట ఏర్పడుతుంది.
5. మలేరియా వచ్చిన వారికి ఆకలి ఉండదు. అలసి పోయినట్లు ఉంటారు. నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి వారు బొప్పాయి పండ్లు లేదా నారింజ పండ్లను తింటే కొంత ఉపశమనం కలుగుతుంది.
6. మలేరియా సోకిన కొందరిలో వాంతికి వచ్చినట్లు ఉంటుంది. అందరికీ ఈ లక్షణం కనిపించకపోవచ్చు. కానీ కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తాయి.
ఇక ఇవే కాకుండా.. పొడి దగ్గు, కండరాల నొప్పులు కూడా మలేరియా వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.