మూత్రంలో కాల్షియం, ఆగ్జలేట్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే అవి బయటకు పోవు. దీంతో అవి మూత్ర పిండాల్లో పేరుకుపోయి రాళ్లు ఏర్పడుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. తగినంత నీటిని తాగకపోవడం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, పలు రకాల మందులను వాడడం వంటి కారణాల వల్ల చాలా మందికి కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి.
కిడ్నీ స్టోన్లు వచ్చిన వారిలో పలు రకాల రక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. వాటిని పరిశీలించడం వల్ల ముందుగానే వాటిని గుర్తించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవచ్చు. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లు పెద్దగా అవకుండా జాగ్రత్త పడవచ్చు.
1. మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చిన వారికి తరచూ జ్వరం వస్తుంటుంది. కొద్ది రోజుల పాటు జ్వరంగా ఉండి తగ్గుతుంది. మళ్లీ కొన్ని రోజులకు జ్వరం వస్తుంది.
2. బొడ్డుకు కింది భాగంలో రెండు వైపులా నొప్పి వస్తుంది. సరిగ్గా అదే భాగంలో వెనుక వైపు కూడా నొప్పి వస్తుంటుంది. ఇలా నొప్పి వస్తుంటే కిడ్నీ స్టోన్లు ఉన్నాయేమోనని అనుమానించాలి.
3. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. కొన్ని రకాల పదార్థాల వాసనలు చూస్తే కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది. వాంతికి అవుతుంది.
4. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి కొన్ని సార్లు తల తిరిగినట్లు అనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోతామోనన్న భావన కలుగుతుంది.
5. మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే అలాంటి వారు మూత్ర విసర్జన చేస్తే దుర్వాసన వస్తుంది. మూత్రం లైట్ కలర్‌లో కాకుండా డార్క్ కలర్ లో వస్తుంది.
6. కొందరికి మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే మూత్రంలో రక్తం కూడా వస్తుంది.
7. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వెన్ను నొప్పి కూడా వస్తుంది.
ఈ లక్షణాలో ఎవరిలో అయినా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇక పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల కూడా కిడ్నీ స్టోన్లను కరిగించుకోవచ్చు. వాటిని తెలుసుకునేందుకు కింద ఇచ్చిన లింక్‌ను సందర్శించండి..!
కిడ్నీ స్టోన్స్‌ను సహజ సిద్ధంగా తొలగించుకునేందుకు 5 అద్భుతమైన చిట్కాలు
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365