Red Dots On Skin : మన శరీరంపై అప్పుడప్పుడు అనేక రకాల మచ్చలు ఏర్పడుతుంటాయి. వాటిల్లో ఎరుపు రంగు మచ్చలు ఒకటి. ఇవి గుల్లల మాదిరిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి మరీ చిన్నవిగా.. ఒక్కోసారి సైజులో పెద్దగా ఏర్పడుతుంటాయి. అలాగే దద్దుర్ల మాదిరిగా కూడా ఇవి మనకు చర్మంపై అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఎందుకు వస్తాయి ? వీటిని ఎలా తొలగించుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వేసవిలో శరీరంలో బాగా వేడి ఉంటుంది. అయితే ఈ వేడి మరీ ఎక్కువైతే చర్మంపై ఎరుపు రంగులో పొక్కులు ఏర్పడుతుంటాయి. వీటినే చెమటకాయలు అంటారు. ఇవి త్వరగానే తగ్గిపోతాయి. ప్రిక్లీహీట్ పౌడర్‌ను వాడినా లేక వేపాకులను పేస్ట్‌లా చేసి రాసినా.. చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. వీటి గురించి ఇబ్బంది పడాల్సిన పనిలేదు.
ఇక కెరాటోసిస్ పైలారిస్ అనే చర్మవ్యాధి ఉన్నా కూడా ఇలాగే చర్మంపై ఎరుపు రంగులో మచ్చలు వస్తుంటాయి. ఇవి చిన్నగా ఎరుపు లేదా తెలుపు రంగులో ఏర్పడుతాయి. వీటిలోపల మాంసం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా వీపు, ఛాతి, చేతులపై వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే చర్మ వ్యాధుల డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే చర్మ శుభ్రతను పాటించాలి. చర్మంపై తేమ ఏర్పడకుండా చూసుకోవాలి. శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.
ఇక ఎవరికైనా స్కిన్ అలర్జీ ఉంటే వారిని టచ్ చేస్తే ఇతరులకు కూడా చర్మ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్నే కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఇది వచ్చినా కూడా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
కొందరికి గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా చర్మంపై వేర్వేరు చోట్ల ఇలా ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తుంటాయి. కనుక ముందుగా వాటికి చికిత్స తీసుకోవాలి. అప్పుడు ఈ మచ్చలు కూడా తొలగిపోతాయి. అలాగే మహిళలకు రొసాసియా అనే చర్మ సమస్య వస్తుంది. అలాంటి వారి చర్మంపై కూడా ఇలాంటి మచ్చలే కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకోవాలన్నా.. చిట్కాలు ఏమీ పనిచేయవు. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సిందే. కానీ ఇతరులకు ఇది సోకకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఈ వ్యాధి ఉన్నవారిని ఇతరులు టచ్ చేయరాదు. వారు వాడే వస్తువులను ముట్టుకోరాదు. దీంతో ఇతరులకు ఇది వ్యాపించకుండా చూసుకోవచ్చు.
చర్మంలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నా కూడా ఇలాగే చర్మంపై ఎరుపు రంగు మచ్చలు దర్శనమిస్తుంటాయి. దీంతోపాటు బాక్టీరియా.. వైరస్‌ల కారణంగా కూడా ఇలా జరుగుతుంటుంది. కనుక ఈ సమస్య ఉంటే అసలు అశ్రద్ధ చేయరాదు. వెంటనే చర్మ సంబంధ డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు నిర్దారణ అయితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో చర్మంపై ఉండే ఈ ఎరుపు రంగు మచ్చలు పోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.