Soya Chunks : మీల్ మేక‌ర్ ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..

Soya Chunks : మ‌నం ఎక్కువ‌గా మీల్ మేక‌ర్ అని పిలిచే వీటిని సోయా చంక్స్ అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ప్రొటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల‌న ముఖ్యంగా శాకాహారులు చికెన్, మ‌ట‌న్, గుడ్లు, డైరీ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యామ్నాయంగా మీల్ మేక‌ర్ ను తింటూ ఉంటారు. త‌క్కువ కొలెస్ట్రాల్, సులువుగా వండుకోవ‌డం , మంచి రుచి,అధిక ప్రొటీన్లు మొద‌లైన గుణాలు క‌లిగి ఉండటం వ‌ల‌న ఎక్కువ మంది సోయా చంక్స్ ను ఎంచుకుంటూ ఉంటారు.

సాధార‌ణంగా సోయా బీన్ గింజ‌ల నుండి నూనెను తీసిన త‌రువాత మిగిలిపోయిన పిప్పి లేదా పిండి నుండి మీల్ మేక‌ర్ ను త‌యారు చేయ‌డం జ‌రుగుతుంది. దీనిలో ఉండే హై ప్రొటీన్లు శ‌రీరంలోని క‌ణాల వృద్ధికి, హార్మోన్ల స‌మ‌తుల్య‌త‌, శ‌రీరంలోని ధ్ర‌వాలు, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డం, ఎముక‌లు కండ‌రాల‌ను గ‌ట్టి ప‌ర‌చ‌డం, శ‌క్తిని ఇవ్వ‌డం మొద‌లైన ప‌నుల‌ను నిర్వ‌ర్తించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. కాబ‌ట్టి శాకాహారుల‌కు అవ‌స‌ర‌మైన ప్రొటీన్ ను అందించ‌డంలో సోయా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Soya Chunks if you are taking them then know this
Soya Chunks

అయితే సోయా లో ఉండే హై ప్రొటీన్లు, త‌క్కువ మోతాదులో ఉండే కార్బో హైడ్రేట్ల వ‌ల‌న దీనిని భోజ‌నంలో భాగం చేసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ వీటిని రోజూ లేదా త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల‌న హార్మోన్ల అస‌మ‌తుల్య‌త అలాగే థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని పోష‌కాహార నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సోయా చంక్స్ అనేవి అతిగా ప్రాసెస్ చేయ‌బ‌డిన మ‌రియు జ‌న్యు మార్పిడి చేయ‌బ‌డిన జాబితాలోకి వ‌స్తుండడం తో స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అయ్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని చెబుతున్నారు.

సోయా బీన్స్ ను అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల‌న ముఖ్యంగా మూడు ర‌కాల స‌మ‌స్య‌లు వచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఉత్ప‌త్త‌య్యే సోయా లో దాదాపు 90 శాతం జ‌న్యు మార్పిడి చేయ‌బ‌డిన‌వే అని అలాగే మిగిలిన 10 శాతం కూడా జ‌న్యు మార్పిడి చేయ‌బ‌డలేదు అని చెప్పేందుకు స‌రైన ఆధారాలు లేవ‌ని అంటున్నారు. జ‌న్యు మార్పిడి చేయ‌బ‌డిన ఆహారాల‌తో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అలాగే సోయా అనేది అతిగా ప్రాసెస్ కి గురి అవుతుంది కాబ‌ట్టి ప్రాసెస్ చేయ‌బ‌డ‌ని స‌హ‌జంగా ల‌భించే ఆహారాల‌ను ఎంచుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.ఇంకా సోయా ను అతిగా తీసుకోవ‌డం వ‌ల‌న హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కు లోన‌వుతార‌ని దాని వ‌ల‌న థైరాయిడ్ హార్మోన్ లోపాలు ఇంకా శ‌రీరంలోని చాలా ర‌కాల హార్మోన్ల హెచ్చుత‌గ్గుల వ‌ల‌న‌ అవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయ‌ని ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. కాబ‌ట్టి వీట‌న్నింటినీ ధృష్టి లో ఉంచుకుని మీల్ మేక‌ర్ లేదా సోయా చంక్స్ ను వీలైనంత త‌క్కువ‌గా తినాల‌ని సూచిస్తున్నారు.

Editor

Recent Posts