వైద్య విజ్ఞానం

మీకు గుండె పోటు వ‌స్తుంద‌ని చెప్పేందుకు మొద‌ట‌గా క‌నిపించే ప్ర‌ధాన సంకేతం ఇదే..!

గుండెరక్తనాళాలలో ప్రధానంగా రక్త సరఫరాను అడ్డకించే గడ్డలు ఏమైనా వున్నాయేమో పరీక్షించాలి. తదుపరి చర్యగా హృదయ సంబంధిత వ్యాయామాలు, ట్రెడ్ మిల్ వంటివి చేయించి, గుండె కొట్టుకునే రేటును నిర్ధారించాలి. గడ్డల కారణంగా బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతరంగా వీలైనన్ని సిరలను ఏర్పరచి గుండెకు రక్త సరఫరా నిరంతరం అందేలా చూడాలి. గుండె రక్త నాళాలలో బ్లాకేజీలు ఏ విధంగా వస్తాయి?

రక్త నాళాలలో గడ్డలు లేదా బ్లాకేజీలు రక్తంలోని అవాంఛనీయ కొవ్వు నిల్వలు మాత్రమే. ఇవి ప్రతిదినం మీరు తీసుకునే ఆహారంలోని నూనెలు, ఇతర కొవ్వు పదార్ధాల కారణంగా సంవత్సరాల తరబడి పేరుకుంటాయి. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 2,500 కేలరీల ఆహారం తీసుకోగా అందులో సుమారు 1000 కేలరీలు మాత్రమే రోజుకు తన వ్యాయామాల ద్వారా ఖర్చు చేస్తాడు. మిగిలివున్న 1500 కేలరీలు మెల్లగా శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుంటాయి.

this is the first sign that your heart is becoming weak

కొవ్వు పేరుకోడాలు రక్తనాళాలలో పూర్తయితే బ్లాకేజీ ఏర్పడుతుంది. కేలరీలు లోపలికి తీసుకోవడం తగ్గించి మరోవైపు అధికంగా వ్యాయామాలు ఇతర చర్యల ద్వారా ఖర్చు చేస్తుంటే బ్లాకేజీలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. వ్యాధి లక్షణాలు పరిశీలిస్తే, రోగి శ్వాస కష్టంగా తీసుకోవడం, ఛాతీ భాగంలో నొప్పి వంటివాటికి తక్షణమే ఇ.సి.జి లేదా యాంజినా తీస్తారు. గుండెకు రక్త సరఫరా మొదటి దశలో వీటితో సరిగ్గా వుందో లేదో పరీక్షిస్తారు. ఆధునికంగా వచ్చిన నిర్ధారణా టెక్నిక్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ పద్ధతిలో ఫలితాలను మరింత ఖచ్చితంగా వెల్లడిస్తున్నారు.

Admin

Recent Posts