lifestyle

శవం పక్కన ఎక్కువ కూర్చోవద్దని ఎందుకు అంటారు.. కారణాలు ఇవే..

మీకు తెలుసా? మన శరీరంలో పది వాయువులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కానీ చనిపోతే వాటన్నింటినీ ఒక్క వాయువు బయటకు తీసుకు వెళ్లిపోతుంది. ఈ 10 వాయువుల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారవుతుంది. ఈ పంచ భూతాలు మానవ శరీరంలోనే ఉంటాయని యోగులు చెబుతారు. పంచభూతాల్లో ఒకటైన గాలి 10 రూపాల్లో శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుందని సిద్ధ యోగులు వివరించారు. సాధారణంగా మనకు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుందని అనుకుంటాం. ఊపిరి తీసుకొనే ప్రక్రియకు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ ఎలా అయితే ఉపయోగపడతాయో మనషి శరీరంలోకి వెళ్లే గాలి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది.

ఊపిరి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళే గాలి పది రకాలుగా శరీరంలోకి వ్యాపిస్తుందట. అనంతరం ముక్కు, నోరు, పాయువు, శరీర కణాలు, జీర్ణకోశం వంటి ఐదు మార్గాల ద్వారా బయటకు వెళ్తుంది. శ్వాస ద్వారా శరీరంలోకి వచ్చిన గాలి శ‌రీరంలో అనేక రకాల పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరుకు, కళ్లు అటు, ఇటు తిప్పడానికి, కళ్ళు రెప్పలు మూయడానికి, ఆవలించడానికి, దగ్గు, తుమ్ములను కలిగించడానికి ఇలా అనేక రకాలుగా మారి పనులు చేస్తుంది. శరీరంలోకి వచ్చిన గాలి 10 రకాల వాయువులుగా మారుతుంది. పైన తెలిపిన పనులన్నీ వాటివల్లే జరుగుతాయి. అయితే ఒక వాయువు మాత్రం మనిషి చనిపోయిన తర్వాత పనిచేస్తుంది. ఆ వాయువు పేరు మీథేన్‌ వాయువు. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి శరీరంలోనే ఉంటుంది. మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు అక్కడే దాగి ఉంటుంది.

this is why our elders say we do not sit beside dead body

ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత శరీరానికి సహాయం చేస్తున్న 9 వాయువులను నాశనం చేస్తుంది. అవి చేయాల్సిన పనులేవి చేయకుండా ఆపుతుంది. 9 వాయువులను తనలో కలిపేసుకొని ఈ వాయువు విష వాయువుగా మారుతుంది. మనిషి చనిపోయిన తర్వాత విషవాయువుగా మారిన మీథేన్ వాయువు బయటకు వస్తుంది. దాన్ని పీల్చిన వారికి అస్వస్థత కలిగిస్తుంది. అందుకే మనిషి చనిపోయిన వెంటనే అతని ముక్కులో, చెవుల్లో దూది పెడతారు. ఎందుకంటే విషపూరితంగా మారిన మీథేన్ వాయువు బయటకు వస్తే శరీరం వద్ద ఏడుస్తున్న వారికి కూడా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని ఇలా చేస్తారు. అందుకే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దేహాన్ని దహనం చేయమని పెద్దలు చెబుతారు.

Admin

Recent Posts