వైద్య విజ్ఞానం

కేవ‌లం పురుషుల్లోనే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. స్త్రీల‌లో రాదు.. ఎందుక‌ని..?

ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు చాలా మంది హెల్మెట్లు పెట్టుకోడం వల్ల బట్టతల వస్తుందని అనుకుంటారు, అందులో కొంచెము నిజం ఉన్నా, అది ప్రధాన కారణం కాదు. . అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు, వంశపారంపర్యత కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.

మగవాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు, ఆడవాళ్లకు ఆలోచన అంతగా ఉండదు కాబట్టే మగవారికి బట్టతల వస్తుంది, ఆడవాళ్లకు బట్టతల రాదు అని అంటారు కూడా, కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. గుండె జబ్బులు మగవాళ్ళకి అధిక శాతం లో వస్తాయి, ఆడవాళ్ళలో కేవలం కొంత మందికి మాత్రమే గుండెజబ్బులు వస్తాయి, మగవాళ్ళు భాధను భరిస్తూ గుండెల్లో బంధిస్తారు కాబట్టి వారికి గుండెజబ్బులు వస్తాయి, ఆడవాళ్లకు బాధ అంటూ ఒకటి ఉంటేనే గా వారికి గుండెజబ్బులు రాడానికి అని చాలా మంది అంటారు, అందులో కూడా నిజం లేదు. జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు. తలపై వెంట్రుకలు లేని వారంతా బట్టతల సమస్య ఉన్నవారు కాదు. సహజంగా బట్టతల రావడం జన్యు సంబంధమైన విషయం. పైగా అది ద్వితీయ లైంగిక లక్షణాలకు సంబంధించిన జీవ భౌతిక ధర్మం.

why only men get bald head not women

మానవ పరిణామ క్రమంలో మునుపటి జీవుల్లో ఉపయుక్తమైనవి అవసరం లేనట్లయితే ఆయా శారీరక అవయవాలు లేదా లక్షణాలు తరువాతి జీవుల్లో అంతరించడం సర్వసాధారణం. శరీరంపై వెంట్రుకలు వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాల్ని తట్టుకోవడానికి సహకరిస్తాయి. అందుకే గొర్రెలు, కోతులు, చింపాంజీలకు ఒళ్లంతా జుట్టు ఉంటుంది. ఆది మానవుడి దశ నుంచి ఆధునిక మానవుడిగా మారే క్రమంలో నివాసం, దుస్తులు వంటి బాహ్య రక్షక వ్యవస్థలను వాడుకోవడం మొదలయ్యాక మానవ పరిణామంలో జుట్టు అవసరం క్రమేపీ తగ్గింది. కానీ శరీరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన తల, వక్షస్థలం, బాహుమూలలు, జననేంద్రియాలు వంటి ప్రదేశాల్లో జుట్టు తగ్గడం పరిణామక్రమంలో వెనకబడి ఉంది. సాధారణంగా శారీరక ఒత్తిడి – ఉదా: దీర్ఝకాలిక జబ్బులు, శస్త్ర చికిత్సానంతరం, తీవ్రమైన అంటు వ్యాధుల తరువాత రెండు మూడు నెలలు వరకూ జుట్టు రాలిపోవచ్చు. ఒక్క సారిగా హార్మోనుల అసమతుల్యం మూలంగా, ముఖ్యంగా స్త్రీలలో కాన్పు తరువాత జుట్టు రాలవచ్చు. ఈ స్ధితులలో సుమారుగా జుట్టు రాలవచ్చు, కానీ చాలా కొద్ది మార్లు తీవ్రంగా ఉంటుంది. అటువంటి సమయంలో వైద్య సలహా అవసరం.

కొన్ని జబ్బులకు వాడే మందుల వల్ల చాలా జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం కూడా జరుగుతుంది. ధైరాయిడ్ గ్రంధి జబ్బులలో (హార్మోను అధికం కావడం,తక్కువ కావడం) వల్ల వచ్చే పలు లక్షణాలలో జుట్టు రాలడం ఒకటి. సెక్స్ (లైంగిక హార్మోన్లు) హార్మోన్లు అసమతుల్యం, తీవ్రమైన పౌష్ఠికాహార లోపం, ముఖ్యంగా ప్రోటీన్లు, ఐరన్ (ఇనుము), జింక్, విటమినుల లోపం, ఈ లోపాలు ముఖ్యంగా పరిమితంగా ఆహారం తీసుకొను వారిలో, స్త్రీలలో ఋతుస్రావం అధికంగా వున్న పరిస్ధితులలో కనబడుతుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్లు, కొన్ని రకాల ఫంగల్ జబ్బులలో ఇది మచ్చలు, మచ్చలుగా కొద్ది పాటి విసర్జనలలో కనిపిస్తుంది. ఇది చిన్న పిల్లలలో అధికంగా కనిపిస్తుంది. అనువంశికం (లేక) వంశపార పర్యంగా వచ్చు జుట్టు రాలడం. పురుషులలో ఇది ఒక క్రమంలో (ముందు భాగం నుంచి పలుచ పడుకుంటు పై భాగంలో పూర్తిగా ఊడిపోవడం – బట్టతల ) కనబడుతుంది. ఇది సర్వ సాధారణంగా కనబడే లక్షణం. ఇది పురుషుల జీవితకాలంలో ఎప్పుడైనా మొదలు కావచ్చు. చాలా చిన్న వయసులో 13 నుంచి 19 సం.ల వయసులో కూడా మొదలు కావచ్చు.

ముఖ్యంగా 3 కారణాల సముదాయం కావచ్చు. వంశపారపర్యం, పెరుగుతున్న వయసు, పురుష హార్మోన్లు. స్త్రీలలో జుట్టు రాలిపోవడం ముందు బాగం మొదలు కొని కణతల వైపు నుంచి వెనక్కు వెళుతుంది. తల పైభాగంలో తక్కువగా కనబడుతుంది. ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.ఇంత కన్న ఎక్కువ రాలిన పక్షంలో వైద్య సలహా అవసరం. జుట్టు పలుచబడ్డట్టు అనిపించినా,ఒకటి కంటే ఎక్కువ చోట్ల బట్టతల కనపడ్డా వైద్య సలహా తీసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల్య పౌష్ఠికాహారం తీసుకోవడం. జుట్టు దువ్వుకొనునప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం. జుట్టు రాలిపోవడానికి కారణమైన మందులను మార్చడం. ఫంగల్ ఇన్ ఫెక్షన్ల మూలంగా జుట్టు రాలుతున్న పక్షంలో జుట్టును పరిశుభ్రంగా వుంచుకోవడం. ఎండుగా, జిడ్డు లేకుండా వుంచుకోవడం. ఇతరుల టోపీలు పెట్టుకోకపోవడం ఇతరుల దువ్వెనను వాడక పోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

వంశపారంపర్యంగా వచ్చే బట్టతలను కూడ కొన్ని సందర్భాలలో నివారించవచ్చు. పురుషులలో బట్టతల వస్తుంది కానీ స్త్రీలలో ఎక్కువగా రాదు ఎందుకు అంటే : జుట్టు ఊడటం లో లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు. కొన్ని తరాల తర్వాత ఆయా ప్రదేశాల్లో కూడా జుత్తు తగ్గుతుందని ఆంత్రపాలజిస్టులు సూచిస్తున్నారు. కాబట్టి బట్టతల రావడం పరిణామక్రమంలో సహజ పద్ధతే కానీ దాని పట్ల కలత చెందాల్సిన అవసరం లేదు. ద్వితీయ లైంగిక లక్షణాల ప్రభావం కావడం వల్ల, స్త్రీ సంబంధ హార్మోన్ల ప్రభావం వల్ల ఆడవారి జుట్టు పొడవుగా, దట్టంగా ఉంటుంది. వారికి బట్టతల వచ్చేలా హార్మోన్లు సహకరించవు.

కొన్ని రకాల జబ్బులు, మానసికవ్యాధులు, ఆహార లోపాల వల్ల జుత్తు రాలిపోయి తల బోడిగా కనిపిస్తే డాక్టరును సంప్రదించి తగు విధమైన వైద్యం తీసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది. బట్టతల పట్ల ఆందోళన పడకుండా అనవసర ప్రయోగాలు చేసుకోకుండా ఇది మామూలే అనుకుంటూ అదే అందం అనుకుంటే సరిపోతుంది.

Admin

Recent Posts