రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటిస్ అంటారు. అయితే ప్రీ డయాబెటిస్ అనే మాట కూడా మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. ఇంతకీ అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి ? దీంతో ఏమవుతుంది ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? వంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దేశించిన విలువల కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటిస్ అంటారు. అయితే మరీ ఎక్కువగా ఉండకుండా కొంచెం బార్డర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువగా ఉన్నా దాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు. అంటే ఉదాహరణకు పరగడుపున షుగర్ టెస్టు చేయించుకుంటే ఆ విలువ 80 నుంచి 110 మధ్య రావాలి. కానీ 111 నుంచి 120 వరకు వస్తే దాన్ని షుగర్ అనరు. ప్రీ డయాబెటిస్ అంటారు. అదే చాలా ఎక్కువగా వస్తే దాన్ని డయాబెటిస్ అంటారు. ఇలా ప్రీ డయాబెటిస్‌ను అర్థం చేసుకోవచ్చు. అంటే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డయాబెటిస్ వచ్చేందుకు ముందు ఉన్న స్టేజినే ప్రీ డయాబెటిస్ అంటారు. ఈ స్టేజిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే అది డయాబెటిస్‌కు దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే వైద్యులు మెడిసిన్లను ఇవ్వరు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తే ఈ స్టేజి నుంచి సులభంగా బయట పడవచ్చు. కనుకనే ప్రీ డయాబెటిస్ స్టేజిలో మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు.
ఇక ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నవారు కొన్ని రకాల షుగర్ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. దాహం అతిగా వేయడం, మాటి మాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతమాత్రం చేత షుగర్ వచ్చిందని భావించడానికి లేదు. జాగ్రత్తలను పాటిస్తే ప్రీ డయాబెటిస్‌ను తగ్గించుకుని షుగర్ రాకుండా చూసుకోవచ్చు.
రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల ప్రీ డయాబెటిస్ నుంచి బయట పడవచ్చు. లేదా రాత్రి పూట కొవ్వు తీసిన పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగుతుండాలి. లేదా పసుపు ట్యాబ్లెట్లు కూడా మనకు లభిస్తాయి. వాటిని పూటకు 250 ఎంజీ చొప్పున భోజనానికి ముందు వేసుకోవాలి. ఇక రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీంతోపాటు ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. పిండి పదార్థాలను తగ్గించాలి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. ఇలా సూచనలు పాటిస్తే ప్రీ డయాబెటిస్ నుంచి బయట పడవచ్చు. షుగర్ రాకుండా చూసుకోవచ్చు. లేదంటే ఒక్కసారి షుగర్ అని తేలితే జీవితాంతం మందులను వాడాల్సి వస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365