కూర‌గాయ‌లు

సొరకాయ (ఆనపకాయ) పోషకాలకు గని.. దీని లాభాలు తెలిస్తే రోజూ తింటారు..!

సొరకాయ.. దీన్నే కొన్ని ప్రాంతాల వాసులు ఆనపకాయ అని కూడా అంటారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువగా వీటిని చారులో వేస్తుంటారు. దీంతో అవి చక్కని రుచిని అందిస్తాయి. అయితే సొరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of bottle gourd

1. సొరకాయల్లో విటమిన్లు బి, సి, ఎ లతోపాటు మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. శరీరానికి పోషణను అందిస్తాయి.

2. మూత్ర నాళాల సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. సొరకాయ జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్‌ మోతాదులో తాగుతుంటే అలసట, నీరసం తగ్గుతాయి. శక్తి లభిస్తుంది.

4. సొరకాయ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్‌ అధికంగా ఉంటుంది కనుక మలబద్దకం తగ్గుతుంది.

5. సొరకాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

6. సొరకాయలు కిడ్నీల ఆరోగ్యానికి, స్త్రీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కిడ్నీలను శుభ్రంగా ఉంచుతాయి. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

7. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి సొరకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటి జ్యూస్‌ను తాగడం వల్ల వారిలో అధిక దాహం తగ్గుతుంది. సొరకాయల్లో ఉండే విటమిన్‌ సి, జింక్‌లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

8. సొరకాయ గుజ్జును ముఖానికి రాస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు, నల్లని వలయాలు తగ్గుతాయి.

9. శరీరంలోని వాపులను తగ్గించడంలోనూ సొరకాయ పనిచేస్తుంది. దీంతో ఆర్థరైటిస్‌ నొప్పుల నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts